ప్రేమికులకు గుండు కొట్టించారు…


ఒడిశాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ యువకుడు తన ప్రియురాలితో ఏకాంతంగా గడపుతుండగా.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు ఇద్దరిని విచక్షణా రహితంగా చితకబాదారు. అందరి ముందు గుండు కొట్టించారు. ఈ ఘటన మయూర్‌భంజ్‌, కరంజిలా బ్లాక్‌లోని మండువా గ్రామంలో గత శనివారం(జూన్‌ 22)న చోటుచేసుకుంది. వారిద్దరికి గుండు కొట్టించడమే కాకుండా సెల్ ఫోన్లలో ఫొటోలు తీశారు. అవి కాస్త సోషల్‌మీడియా వేదికగా వైరల్‌ కావడంతో పోలీసులు దృష్టికి వచ్చింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

About The Author