అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వండి : జగన్ ఆదేశాలు


అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వండి :
జగన్ ఆదేశాలు

అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అక్రమ కట్టడాల జాబితాలో చంద్రబాబు ఇల్లు కూడా ఉన్నట్లు తెలిసింది. విజయవాడలో ప్రధానమైన రైవస్‌ కాలువ, బందరు కాలువగట్ల వెంబడి వందలాది కట్టడాలు అక్రమంగా వెలిశాయి. అందులో ప్రభుత్వ శాఖలకు చెందినవీ ఉన్నాయి.స్వయంగా విజయవాడ పోలీసు కమిషనర్‌ బంగ్లాతోపాటు, సీఆర్డీయే ఆఫీసు కూడా అక్రమమే! ‘ప్రజా వేదిక’కు వర్తించే ప్రమాణాలు ఈ భవనాలకూ వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో… విజయవాడ నగరంలో కాలువ గట్ల వెంబడి ఉన్న ప్రభుత్వ భవనాలను కూడా కూల్చివేస్తారా? అనే చర్చ అధికారవర్గాల్లో మొదలైంది

About The Author