శాసనసభ నూతన భవనానికి సీఎం కేసీఆర్ భూమిపూజ…

నూతన శాసనసభ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఉదయం భూమిపూజ చేశారు. నగరంలోని ఎర్రమంజిల్‌లో రూ.100 కోట్లతో శాసనసభ, మండలి, సెంట్రల్‌ హాల్‌లను నిర్మించనున్నారు. ప్రస్తుత శాసనసభ భవనం నిజాం కాలం నాటిది కావడంతో ఇప్పటి అవసరాలకు తగ్గట్లుగా నిర్మించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా వివిధ ప్రాంతాలను పరిశీలించి.. ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ సముదాయాన్ని ఎంపిక చేశారు. భూమిపూజ కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కేశవరావు, హరీశ్‌రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సచివాలయ నూతన భవనానికి…
అంతకుముందు తెలంగాణ నూతన సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ప్రస్తుత సచివాలయం డి-బ్లాక్‌ వెనుకభాగంలోని తోటలో సచివాలయ భవనం నిర్మించనున్నారు. సచివాలయం ప్రస్తుతం 25 ఎకరాల్లో ఉండగా దాన్ని 30 ఎకరాల మేరకు విస్తరించనున్నారు. వాస్తు దోషం లేకుండా అన్ని హంగులతో రూ.400 కోట్ల వ్యయంతో సచివాలయ భవన నిర్మాణం చేపట్టనున్నారు.
రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ ఎస్‌.కె. జోషి, ఎంపీ కేశవరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

About The Author