అర్హులైన పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి…జగన్


అర్హులైన పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నవంబర్ నాటికి 6,576 ఇళ్ళు దాదాపుగా పూర్తి అవుతాయని మంత్రి వెల్లడించారు. సచివాలయంలో మంత్రి తన ఛాంబర్ లో పట్టణ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ళు పంపిణీ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు విజయవాడకు కేటాయించిన 55,800 ఇళ్ళకు గాను నవంబర్ నాటికి జక్కంపూడి లో 6,576 ఇళ్ళు గ్రౌండింగ్ పనులు పూర్తి చేయటం జరుగుతుందన్నారు. ఇందులో 3,840 ఇళ్ళకు స్లాబ్ వర్క్ పూర్తి చేయటం జరిగిందన్నారు. మిగిలిన ఇళ్ళు పూర్తి చేసేందుకు గానూ 430 ఎకరాల భూమి సేకరించవలసి ఉందని చెప్పారు. ఇందుకుగానూ సూరంపల్లి లో 180 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలో తిలోచనపురంలో 360 ఎకరాలు, మూలపాడు నందు 48 ఎకరాలు సేకరించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. పట్టణ గృహ నిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులతో మరో సమావేశం నిర్వహించి నిర్ణయం తెలుపుతామన్నారు. సమావేశంలో పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.చిన్నోడు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన రావు, జక్కంపూడి అసిస్టెంట్ ఇంజనీర్ రంగ రాజు, తదితరులు పాల్గొన్నారు. #iprap

About The Author