మరణించిన తర్వాత తల దగ్గర దీపం ఎందుకు పెడతారు?

హిందూ దీపం అనేది వెలుగును ప్రసాదిస్తుంది. మన హిందూ సంప్రదాయంలో దీపం అనేది జ్ఞానదీపం. హిందువులు ప్రతి రోజు ఇంటిలో దీపాన్ని వెలిగిస్తారు. ఏదైనా కార్యాన్ని ప్రారంభించినప్పుడు దీపాన్ని వెలిగించడం ఆచారంగా వస్తుంది. శుభ కార్యాల్లో అయితే దీపం వెలిగించకుండా ఏ పని చేయరు. అలాగే మరణించిన తర్వాత తల దగ్గర దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకంటే శవాన్ని చీకటిలో ఉంచకూడదు అంటుకే దీపాన్ని వెలిగిస్తారు. మరి పగలు వెలుతురు ఉంటుంది కదా..మరి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అనే అనుమానం రావొచ్చు. దీనికి కూడా కారణం ఉంది.

మనం బతికి ఉన్నప్పుడు దీపం చీకటిలో ఎలా దారి చూపిస్తుందో అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా దీపం మోక్ష మార్గం చూపుతుందట. మరణించిన తర్వాత వారి ఆత్మ బ్రహ్మ కపాలం నుంచి బయటకు వస్తేనే వారి ఆత్మకు మోక్ష మార్గం దొరుకుతుందని పురాణాలు చెబుతున్నాయి.

మరణించిన తర్వాత బ్రహ్మ కపాలం నుంచి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మమోక్ష మార్గానికి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఉత్తరమార్గం, రెండోది దక్షిణ మార్గం. దక్షిణ మార్గంలో చీకటి ఉంటుంది. ఉత్తరమార్గంలో వెలుగు ఉంటుంది. బయటకు వచ్చిన ఆత్మకు తల పక్కన ఉన్న దీపం ఉత్తరమార్గం వైపునకు వెళ్లడానికి దారి చూపిస్తుందట. తల దగ్గర ఉన్న దీపమే వెలుగు చూపించి సహాయం చేస్తుందని, అందుకే మరణించిన తర్వాత తల దగ్గర దీపం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.

About The Author