ఈ ఫోటోలో మామిడి కాయలు అమ్ముతున్నది ఎవరో మీకు తెలుసా..?
ఆమె సాధారణ మహిళ అనుకుంటున్నారా………!
కాదు ………… కానే కాదు………..
ఆమె – లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కు కుమార్తె
ఆమె – 8 సార్లు ఎం.పి. గా గెలిచిన ఒక నాయకుని కుమార్తె
అవును……..మీరు చదువుతున్నది వాస్తవమే…….!
వివరాల్లోకి వెళితే………..,
ఈ మహిళ పేరు చంద్రావతి సారు. ఈమె లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా కుమార్తె. ఈయన ఒక పూరి గుడిసెలో నివసిస్తూ అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు.
ఆయన అడుగుజాడల్లోనే వెళుతున్న ఈమె, వృత్తిరీత్యా టీచర్ అయినా కూడా రాంచీకి 40 కి.మీ. దూరంలోని కుంతి అనే పట్టణంలో మామిడికాయలు అమ్ముతోంది.
చంద్రావతి సారు గారు మాట్లాడుతూ, “ నేటి యువతరం వ్యవసాయం పట్ల గౌరవం, ఇష్టం కలిగి ఉండాలనే సందేశం ఇవ్వడానికి ఈ విధంగా వీధుల్లో మామిడి పండ్లు అమ్ముతున్నానని, ఏ పని చేయడానికైనా సిగ్గు పడరాదనీ తన తండ్రి నేర్పారనీ ఆమె గర్వంగా చెప్పారు.
అయినా, మన పని మనం చేసుకోవడంలో ఇబ్బంది ఏముంటుందని చంద్రావతి అన్నారు. మామిడికాయలు అమ్మడంలో సమస్యేమీలేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకుంటారన్న దాని గురించి తాను ఆలోచించడం లేదని తెలిపారు.
ఇలా మామిడి కాయలను అమ్మగా వచ్చిన డబ్బులను నిరుపేదలకు పంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది చంద్రావతి సారు.