ఆఫ్రికా ఖండం క్రైస్తవ, ఇస్లాం మతాల వలన…
మధ్య ఆఫ్రికా దేశం అయిన బుర్కినా ఫాసో లో ని అర్బిందా గ్రామంలో 19 మంది క్రైస్తవులని ఈ మధ్యనే ఇస్లామిక్ తీవ్రవాదులు చంపేశారు. ఇది జరిగిన తరువాత ప్రాణభయంతో ఎందఱో క్రైస్తవులు ఆ గ్రామాన్ని వదిలి పారిపోయారు. దీనితో ఇప్పుడు ఆ గ్రామంలో ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. అక్కడ మాత్రమె కాదు, మధ్య ఆఫ్రికాలో మరెన్నో ప్రదేశాలలో ఇదే పరిస్థితి.
ఆఫ్రికా ఖండం క్రైస్తవ, ఇస్లాం మతాల వలన బాద పడుతున్నాయి. నేను జతపరిచిన మ్యాప్ ఒక సారి చూడండి, మీకు విషయం బాగా అర్ధం అవుతుంది. ఆఫ్రికాలో 90% క్రైస్తవం, ఇస్లాంలలోకి మారిపోయారు. ఉత్తర ఆఫ్రికా దేశాలలో దాదాపు అందరూ ముస్లింలే, అలానే దక్షిణ ఆఫ్రికా దేశాలలో దాదాపు అందరూ క్రైస్తవులే. అయితే మధ్య ఆఫ్రికా దేశాలైన నైజీరియా, ఐవరీ కోస్ట్, బుర్కినా ఫాసో, చాద్ వంటి దేశాలలో రెండూ మతాలూ బలంగా ఉన్నాయి. ఈ దేశాలలో కూడా దక్షిణ భాగంలో క్రైస్తవులు ఎక్కువగా ఉంటె ఉత్తర భాగాలలో ఇస్లాం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి నైజీరియాని తీసుకుంటే అక్కడ కొంచెం అటు ఇటుగా 50% ముస్లింలు, 50% క్రైస్తవులు ఉంటారు. ముస్లింలలో దాదాపు అందరూ ఉత్తరభాగంలో ఉంటె క్రైస్తవులలో దాదాపు అందరూ దక్షిణ భాగంలో ఉంటారు.
అంటే ఇస్లాం, క్రైస్తవాలు ఆఫ్రికా ఖండాన్ని చక్కగా పంచుకున్నాయన్న మాట. ఉత్తర, దక్షిణ భాగాలలో మొత్తం మొత్తం ఒక మతం వాళ్ళే కాబట్టి, పెద్ద ఇబ్బందులు లేవు. కానీ, మధ్య ఆఫ్రికాలో మాత్రం ఇద్దరూ ఉంటారు కనుక గొడవలు సర్వ సామాన్యం. దీనిలో భాగంగా జరిగిందే ఈ బుర్కినా ఫాసో ఘటన. ఇటువంటివి మరెన్నో జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి. ప్రపపంచంలో ఎక్కడైనా వీళ్ళది ఒకటే వ్యూహం. ఒక ప్రాంతంలో జనాభాని పెంచుకోవడం, అటుతరువాత, అక్కడ ఉన్న ఇతర మతస్తులని గెంటేయ్యడం, చంపెయ్యడం, పూర్తిగా ఆ ప్రాంతాన్ని ఇస్లామీకరించడం. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్ లో, కాశ్మీర్ లో, కైరనాలో, మీరట్ లో, బుర్కినా ఫాసో లో, మధ్య ఆఫ్రికాలోని మరెన్నో ప్రదేశాలలో, ఐరోపా సహా ప్రపంచంలోని మరెన్నో ఇతర ప్రదేశాలలో ఇదే జరుగుతోంది.
మన దేశాన్ని కూడా ఆఫ్రికాని నాశనం చేసినట్లు నాశసం చేద్దామని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. కొంత మేర సఫలం అయ్యారు. మన దేశాన్ని కూడా బహుశా ఇలానే పంచుకున్నట్లున్నారు. ఉత్తర భారత దేశం అంతా ఇస్లాం, దక్షిణ భారత దేశంలో క్రైస్తవం. ఉత్తర భారతంలో పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే పోయాయి. కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ వంటి మరికొన్ని రాష్ట్రాలలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక దక్షిణాదికి వస్తే కేరళలో క్రైస్తవం బలంగా ఉంది, ఆంద్రలో పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఆఫ్రికాలో జరిగినట్లు మన దగ్గర కూడా జరిగితే, మనదేశం కూడా ఆఫ్రికాలానే ముక్కలు ముక్కలు అవ్వడం ఖాయం. హిందూ ధర్మమే మన దేశాన్ని కలిపి ఉంచుతోంది అన్న విషయం మర్చిపోకూడదు. అది పోయిన నాడు, దేశం భాషల, మతాల ఆధారంగా ముక్కలు కావడం ఖాయం. అదే జరిగిన నాడు, ఇప్పుడు ఎలా అయితే ఆఫ్రికాలో కొట్టుకు చస్తున్నారో, రేపు మన దగ్గర కూడా అదే పరిస్థితి.
ఇది జరగకూడాడు అంటే హిందూ ధర్మం బలంగా ఉండాలి, వ్యాపించాలి. లేదంటే మన బ్రతుకులు కూడా ఆఫ్రికా వాళ్ళ బ్రతుకులలానే తయారవుతాయి. మతం మత్తులో జనాలని ఉంచి, అక్కడ ఉన్న సహజ వనరులని చౌక ధరకు ఐరోపా దేశాల వాళ్ళు తరలించుకు పోతున్నారు. ఒక దేశాన్ని నియంత్రించి, దోచుకోడానికి మతం ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని ఐరోపా వాళ్ళు వలస పాలన సమయం నుండీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడే కాదు, స్వంతంత్రం రాక ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఉద్దరించేస్తున్నారు అని చుర్చీలలో బోధించేవారు, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అంటే మనలోనే కొందరిని, దేవుడు, మతం అన్న పేర్లు చెప్పి మనకే తెలియకుండా వాళ్ళ ప్రయోజనాలని అనుగుణంగా పని చేసేలా చేస్తారన్న మాట. అంటే మన వేళ్ళతో మన కళ్ళే పోడుచుకునేలా చేస్తారన్నమాట. దీనికి వాళ్ళు వాడుకునేది మతాన్ని. మతమార్పిడి దేశ నాశనానికి హేతువు. దీని వలన అందరం నష్ట పోతాం.