మీ వాట్సప్ పని చేస్తోందా? ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. వీటి సర్వర్లు డౌన్ అయ్యాయట..!


భారత్ లో వాట్సప్ చాట్ ఇంటర్ ఫేస్ యాక్టివ్ గానే ఉన్నప్పటికీ… ఫోటోలు, ఆడియో, వీడియో ఫైల్స్ పంపుతే మాత్రం వెళ్లడం లేదట. ఇన్ స్టాగ్రామ్ పోస్టులు, స్టోరీలు కూడా యాక్టివ్ గానే ఉన్నప్పటికీ.. ఫోటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్ పంపడం కుదరడం లేదు.
మీరు సోషల్ మీడియా ప్లాట్ పాంలు ఉపయోగిస్తారా? వాట్సప్ అకౌంట్ ఉందా మీకు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కూడా ఉందా? ఆ అకౌంట్లలో మీరు లాగిన్ అవుతున్నారా? ఆ సర్వీసులు ఇవాళ నిలిచిపోయాయి. అవి సరిగ్గా పని చేస్తలేవు. ఈరోజు ఉదయం నుంచి వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ సర్వర్లలో టెక్నికల్ సమస్యలు వచ్చాయట. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ సమస్య ఉందట. ముఖ్యంగా యూరప్, యూఎస్ఏ, ఆఫ్రికాలో మాత్రం వీటి సర్వర్లు డౌన్ అయ్యాయట.
భారత్ లో వాట్సప్ చాట్ ఇంటర్ ఫేస్ యాక్టివ్ గానే ఉన్నప్పటికీ… ఫోటోలు, ఆడియో, వీడియో ఫైల్స్ పంపుతే మాత్రం వెళ్లడం లేదట. ఇన్ స్టాగ్రామ్ పోస్టులు, స్టోరీలు కూడా యాక్టివ్ గానే ఉన్నప్పటికీ.. ఫోటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్ పంపడం కుదరడం లేదు.
అంతే కాదు… వీటిలోని బగ్ వల్ల కస్టమర్.. ఆ ప్లాట్ ఫాంల నుంచి వీడియోలు, ఆడియోలు, ఫోటోలను డౌన్ లోడ్ చేసుకోలేడు. అయితే… ఇది సైబర్ అటాకా? లేక సాఫ్ట్ వేర్ లో వచ్చిన ఎర్రరా? అనే విషయంపై ఫేస్ బుక్ ఇంతవరకు స్పందించలేదు. వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ కూడా ప్రస్తుతం ఫేస్ బుక్ చేతిలోనే ఉన్నాయి.ఈరోజు రాత్రి 8.30 సమయంలో భారత్ లో వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు పూర్తిగా ఓ గంట పాటు నిలిచిపోయాయి. వాట్సప్ ప్రస్తుతం యూరప్, యూఎస్ఏలో పూర్తిగా డౌన్ అయిపోయిందట. మిగితా దేశాల్లో వాట్సప్ నుంచి మెసేజ్ లు మాత్రం వెళ్తున్నాయి. మరి.. వీటి సర్వర్ల సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారో అనేదానిపై క్లారిటీ రాలేదు.

About The Author