మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి?


స్త్రీలకు వివాహ సమయంలో ‘కాలిమట్టెలు’ తరతరాలుగా వస్తోంది.
స్త్రీలకు వివాహ సమయంలో ‘కాలిమట్టెలు’ తొడుగు సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. బంగారం ఖరీదనే కాకుండా … దానిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు కాబట్టి కాలికి పెట్టరు. అందువలన కేవలం వెండితో మాత్రమే కాలి మట్టెలు తయారు చేయిస్తుంటారు. ఇక వివాహసమయంలో తొడిగిన ఈ మట్టెలను స్రీలు ఎట్టి పరిస్థితుల్లోను తీయరు. ఒకవేళ అవి పాతబడి అరిగిపోవడం జరిగితే కొత్తవి తెచ్చుకున్న తరువాత మంచిరోజు చూసి మార్చుకోవడం జరుగుతుంది.
వివాహానికి సంబంధించిన వివిధ ఆచారాలకు అసలైన అర్ధాలు ఉన్నట్టే … కాలి మట్టెలకు కూడా లేకపోలేదు. కాలు బొటనవ్రేలుకు … రెండవ వ్రేలుకు మధ్య ఒరిపిడి జరగడం వలన, రక్త ప్రసరణ సరిగ్గా జరగడమే కాకుండా మనో వికారాలు నియంత్రించబడతాయి. ఈ కారణంగానే మట్టెలు బొటన వ్రేలు పక్కన ఉన్న వ్రేలుకు పెడుతుంటారు. పూర్వం గృహస్తులు … సాధువులు … యోగులు మొదలైన వారు పాదుకలు ధరించడంలోని ఆంతర్యం కూడా ఇదే.
భార్యా భర్తలు సమానమైన స్థాయిలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, వారి కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఈ విధానాన్ని ఆచారంగా మార్చి మనకి అందించారు.
మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి?
నన్నయ తిక్కన కాలంలో పురుషులు కూడా కాళివేళ్లకు మట్టెలు ధరించెడివారు. అరుదుగా ఈ కాలంలో కూడా అక్కడక్కడ కొందరు పురుషులు సకృత్తుగా మట్టెలు పెట్టుకోవడం కనిపిస్తుంది.
వివాహిత స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో ‘మెట్టెలు’గా ఉన్న ఈ పదం నిజానికి ‘మట్టెలు’. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది.

About The Author