పూరీలో వెలసిన జగన్నాథుని లీలలు అన్నీ ఇన్నీ కావు…
పూరీలో వెలసిన జగన్నాథుని లీలలు అన్నీ ఇన్నీ కావు. జగన్నాథుని విగ్రహాల దగ్గర నుండి ప్రసాదం వరకు విశేషాలతో కూడుకున్నవే. ఆ జగన్నోహనుడికి నివేదించే ప్రసాదం తయారీకీ నియమాలున్నాయి. స్వామి వారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాకశాలగా పూరీ ఆలయ పాకశాలను చెబుతారు. వేళ ఏళ్ల నుంచి మహా ప్రసాదం రుచి ఎలాంటి తేడా ఉండకపోవడం ప్రత్యేకత. ఇక్కడ వంటను సాక్షాత్ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందట, అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. గంగ, యమున బావుల్లోని నీటిని ప్రసాదాల తయారీకి వాడతారు. ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట, ఎప్పుడైతే ఆ జగన్నాథునికి ప్రసాదం నివేదించిన తరువా ఆ ప్రసాదం నుండి సువాసనలు వస్తాయట.