కేంద్ర బడ్జెట్‌ 2019 హైలైట్స్‌…


న్యూఢిల్లీ : *కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో సర్వత్రా బడ్జెట్‌ మీద ఆసక్తి నెలకొంది. పార్లమెంటులో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర‍్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని పార్రంభించారు. రక్షణ మంత్రిగా అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న ఆమె మొట్టమొదటిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డులకెక్కారు. బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి..*

*ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలోని హైలైట్స్‌..*

*సరికొత్త అంతరిక్ష శక్తి భారత్‌*

ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది
ఇస్రో సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం
స్టాక్‌ మార్కెట్‌లో ఎన్నారైలూ పెట్టుబడులు పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తాం

*?ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు*

ఉన్నత విద్యాకేంద్రంగా ఎదిగేందుకు భారత్‌కు ఎన్నో అవకాశాలు
మన ఉన్నత విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్థులు రాక మరింత పెరగాలి
ఏడాదిలోగా ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు
శాస్త్ర సాంకేతిక రంగంలో జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు
ఖేలో ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం
తక్కువ అద్దెకు ఇల్లు రెంట్‌ తీసుకునేలా ఆదర్శ అద్దె విధానం
దేశవ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులను మరో 300 కిలోమీటర్ల మేర పెంచుతాం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులో ఉంది
అక్టోబర్‌ 2 నాటికి దేశవ్యాప్తంగా బహిరంగ మలమూత విసర్జనను నిషేధిస్తాం
విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తాం
వేర్వేరు కార్మిక చట్టాలను వృవస్థీకృతం చేసి.. నాలుగు కోడ్‌లుగా రూపొందిస్తాం

*?ప్రతి ఇంటికీ తారునీరు అందిస్తాం*

పల్లెలు, పెదలు, రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాం..
లక్షా25వేల కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తాం
పర్యావరణహితంగా 30 వేల కిలోమీటరల​ రహదారిని మార్చుతాం
దేశవ్యాప్తంగా సురక్షిత తాగునీరు అందిస్తాం
దేశవ్యాప్తంగా 256 జిల్లాలలో జలశక్తి అభియాన్‌ పథకం అమలు చేస్తాం
2020లో ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి తారునీరు అందిస్తాం
రైతుల ఆదాయం రెండింతలు చేసే విధానాలు అమలుచేస్తాం
పెట్టుబడి లేకుండా వ్యవసాయ పథకం.. ఈ పథకం కింద రైతులకు శిక్షణ ఇస్తాం
మూడేళ్లలో విద్యుత్‌, ఎల్పీజీ గ్యాస్‌ సౌకర్యం లేని ఇల్లు ఉండదు
పేదలకు ఇల్లు నిర్మించే గడువును 114 రోజులకు తగ్గింపు

*1⃣ప్రయాణానికి ఒక ఒకే కార్డు*

ఇక దేశవ్యాప్తంగా అన్ని ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణానికి ఒకే కార్డును ప్రవేశపెడతాం
ఒకే కార్డుతో బస్సు, రైలు, విమానం, మెట్రోల్లో ప్రయాణం చేసే సౌలభ్యం కల్పిస్తాం
ఒకే గ్రిడ్‌ కిందకి అన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాను తీసుకొస్తాం
పేద, మధ్యరగతి వర్గాలకు తక్కువ ధరకు గృహ సదుపాయం కల్పిస్తాం
గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడానికే భారత్‌ మాల పథకం
అద్దెకుండే వారి హక్కుల పరిరక్షణకు కొత్త చట్టం తీసుకొస్తాం
దేశవ్యాప్తంగా మూడు కోట్లమంది చిన్న వ్యాపారులకు పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తాం

*?ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు కొనేవారికి రాయితీలు*

ఐదేళ్లలో మనం సాధించిన పేటెంట్ల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది
బలమైన దేశం కోసం.. బలమైన పౌరుడు అనే విధానంతో ముందుకెళ్తాం
లక్ష్యసాధనలో నమ్మకముంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది
బలమైన గాలులు వీచినా దీపం వెలుగుతుంది
ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా సాగుతున్నాం
సంస్కరణలు, పనితీరు, మార్పు దిశగా ముందుకెళ్లడం మా విధానం
మా ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఉపాధి, ఉద్యోగ కల్పన కీలకం
మేకిన్‌ ఇండియాను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది
తక్కువ అధికారం, ఎక్కువ పరిపాలన పద్ధతిలో నడుస్తున్నాం
భారత్‌ ఇంజినీరింగ్‌ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం
ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు, వాహనాలు కొనేవారికి రాయితీలు కల్పిస్తాం
అంతర్గత నదీ జలరవాణాను అభివృద్ధి చేసి రవాణాకు వినియోగిస్తాం
గంగానదిలో ప్రస్తుతం చేస్తున్న జలరవాణాను నాలుగింతలు పెంచుతాం
చట్టబద్ధంగా వచ్చే ఆదాయాలను మేం చిన్నచూపు చూడబోం. పాలసీ స్తంభన, లైసెన్స్‌ కోటా కంట్రోల్‌ పరిపాలన వంటి రోజులు ఇప్పుడు లేవు. భారత కార్పొరేట్‌ సంస్థలే భారత్‌కు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. జాతి సంపదను పెంచుతున్నాయి. పరస్పర విశ్వాసంతో మనం వృద్ధి సాధించగలం. నిరంతర ఆర్థికావృద్ధి సాధ్యమవుతుంది.
భారత్‌మాలా, సాగర్‌మాలా, ఊడాన్‌ వంటి పథకాలు గ్రామీణ, పట్టణ భారతాల మధ్య ఉన్న దూరాన్ని కలుపుతున్నాయి. మన రవాణా మౌలిక వసతులు ఎంతో మెరుగవుతున్నాయి.
1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మనకు 55 ఏళ్లు పట్టింది. కానీ, హృదయంలో విశ్వాసం, నమ్మకం, ఆశావాదం, ఆకాంక్షతో కృషి చేసి.. గత ఐదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థకు ఒక టిలియన్‌ డాలర్లను జోడించాము.

ప్రస్తుత సంవత్సరంలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. ఐదేళ్ల కిందట ఈ విషయంలో మనం దేశం 11వ స్థానంలో ఉంది.

*చాణక్య నీతి సూత్రాన్ని వల్లించిన నిర్మల*

‘కార్య పురుష కరే న లక్ష్యం సంపదయతె’ అని చాణక్య నీతి సూత్రం చెబుతుంది. దృఢ సంకల్పంతో చేసే కృషి లక్ష్యాన్ని చేరుతుందని దాని అర్థం
ఉర్దూ సూక్తిని ఉటంకించిన నిర్మల

*?బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్‌ ఉర్దూ సూక్తిని ఉటంకించారు. ‘ యకీన్‌ హో తో కోహి రస్తా నిఖల్‌తా హై, హవా కీ ఉత్‌ భి లే కర్‌ చిరాగ్‌ జల్తా హై’ అని పేర్కొన్నారు.*

*?నవ, సుస్థిర భారతానికి పట్టం..*

నవ, సుస్థిర భారతానికి ఇటీవలి ఎన్నికలు పట్టం కట్టాయి. ఓటర్లు పెద్దసంఖ్యలో ముందుకొచ్చి ఓటు వేశారు. పనిచేసే ప్రభుత్వానికి ఆమోదం తెలుపుతూ.. ప్రతి వర్గం ముందుకొచ్చి ఓటేసింది. నవ భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం
నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ తొలి హయాంలో పనిచేసే ప్రభుత్వంగా నిలిచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల మెరుగుదల, సహకార సమాఖ్యవాదం, జీఎస్టీ కౌన్సిల్‌, ద్రవలోటు నియంత్రణ విషయంలో క్రమశిక్షణ వంటి అంశాల్లో దృఢ సంకల్పంతో ప్రధాని మోదీ కృషి చేశారు.

*?నిర్మతా సీతారామన్‌ వినూత్న నిర్ణయం*

తొలిసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనదైన ముద్ర వేశారు. బ్రిటిష్‌ సంప్రదాయానికి స్వస్తి చెప్తూ.. ఆమె పట్టు వస్త్రంలో బడ్జెట్‌ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు. గతంలో బ్రిటిష్‌ సంప్రదాయాన్ని పాటిస్తూ బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్‌ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తెచ్చేవారు. దీనికి ముగింపు పలికిన నిర్మల.. పట్టు వస్త్రానికి రాజముద్ర వేసి.. బడ్జెట్‌ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు.

*?కేంద్ర కేబినెట్‌ ఆమోదంప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ బడ్జెట్‌ 2019ని ఆమోదించింది.*

About The Author