రావణుడికి సీతమ్మను గూర్చి హెచ్చరించిన అమ్మవారు…


మనలో చాలామంది వినే వుంటారు శ్రీ అది శంకరాచార్యులు రచించిన “ లంకాయాం .. శాంకరి దేవి.. “ అని మొదలయ్యే అష్టాదశ శక్తి పీఠ శ్లోకం గురించి..!
ఈ శ్లోక లోని ప్రాధాన్యతని బట్టి, శక్తి పీఠాలలో మొట్టమొదటి శక్తి పీఠం శ్రీలంకలో వుందని తెలుస్తోంది ..!

శ్రీ శాంకరీ దేవి ఆలయం

పురాణ విశిష్టత

ఈ శక్తి పీఠం శ్రీలంకలోని ‘ట్రిమ్కోమలి’ నగరంలో వెలసింది. ఇక్కడి అమ్మవారు దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అష్టాదశ శక్తి పీటాలలో మొదటి శక్తి పీటం ఇదే , ఇక్కడ అమ్మవారిని శాంకరి దేవి అని కొలుస్తారు.ఇక్కడ అమ్మవారి ఎడమ చెవి పడిందని పురాణాలు చెబుతున్నాయి .
రావణాసురుడు ప్రతి నిత్యం ఈ అమ్మవారిని పూజించేవాడని తెలుస్తోంది. అయితే ఆయన సీతను అపహరించి తెచ్చినప్పుడు శ్రీ శాంకరీ దేవి ఎంతగా హెచ్చరించినా వినిపించుకోలేదట. దాంతో ఆగ్రహించిన అమ్మవారు అక్కడ అదృశ్యమై కాశ్మీర ప్రాంతానికి తరలివెళ్లింది.

అమ్మవారి ఆగమనం గురించి సంకేతాలు అందడంతో, మహర్షులు అక్కడికి చేరుకొని ఆమెను ‘బస శంకరీ’ పేరుతో కొలిచారు. అమ్మవారి ఆగ్రహానికి గురైన కారణంగానే రావణాసురుడు పతనమై అంతమయ్యాడని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

ఆలయం గురించి మరిన్ని వివరాలు

శ్రీ శాంకరీ దేవి ఆలయం ,శ్రీలంక తూర్పు ప్రాంతం లోని Koneswaram లో Trimkomali వద్ద వుందని చెప్పబడుతుంది .TRI-CONA-MALAI యే నేటి Trimkomali గా పిలవబడుతున్నది. దానినే కొనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు .
అయితే ప్రస్తుతం, ఈ ప్రదేశంలో .. ఏ ఆలయం లేకపోయినా, శ్రీ శాంకరీ దేవి ఆలయం ఖచ్చితంగా వున్నదని చెప్పినచోట, అది వున్నట్లు చూపే గుర్తుగా, ఒక స్తూప స్థంబాన్ని కొండ శిఖరం మీద నిర్మిచారు.
ఈ ఆలయాన్ని 16 -17 శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేశారు. చరిత్ర ఆధారంగా 17 వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ద్వీపాన్ని ముట్టడించారు. కొండ శిఖరం పైన వున్న ఈ ఆలయాన్ని వారి ఓడ నుండే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు.

అయితే, శాంకరీ దేవి విగ్రహాన్ని, ఆలయం వున్నదని చూపిన స్థలం ప్రక్కనే, ఇప్పుడు ఉన్న శ్రీ త్రికోనేశ్వర (శివ) స్వామి ఆలయంలో భద్రపరచ బడిందని భక్తుల విశ్వాసం.
ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని, శాంకరీ దేవి ఆలయంగా కంటే కూడా, స్థానికులు శివాలయం గానే భావిస్తారు.
(TRI-CONA MALAI అంటే “త్రిభుజం ఆకారంలో” వున్న “కొండ” పై ఉండటం వల్ల – ఆ దేవుణ్ణి శ్రీ త్రికోనేశ్వర స్వామిగా పిలుస్తారు.
ఆ శివాలాయం ప్రక్కనే… ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.. ఆ ఆలయంలోని కొలువైవున్న దేవినే శాంకరీ దేవిగా కొలుస్తున్నారు.

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం.

మీరు చూసి తరించండి

అందరూ దర్శించుకునేందుకు దయచేసి షేర్ చేయండి

ఓం శ్రీ మాత్రే నమః

About The Author