ఏపి అతిధిగా విజయసాయి రెడ్డి…!


వైసీపీ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి దేశ రాజధాని వ్యవహారాల్లో రెడ్‌కార్పెట్ ను వేసేందుకు రాష్ట్రప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది.
ఢిల్లీ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తూ గతనెలలో హడావుడిగా జీవో విడుదలచేసింది జగన్ ప్రభుత్వం.
ఆర్ధిక ప్రయోజనాలు కలిగిన జోడు పదవుల వ్యవహారం తెరమీదకు రావడంతో… వెనక్కు తగ్గిన ప్రభుత్వం గత ఉత్తర్వులను రద్దుచేస్తూ మరో జీవో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే…
అయితే తాజాగా… ఆంద్రప్రదేశ్ జీతభత్యాలు మరియు పెన్షన్ ల చట్టం,1953 లో… ఢిల్లీ లోని ఏపీ భవన్ కేంద్రంగా పనిచేయబోయే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధని, క్రమ సంఖ్య 117 ద్వారా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి సుబ్రహ్మణ్యం సరికొత్త జీవో ను విడుదల చేసారు.
తక్షణం అమలులోకి వచ్చిన ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం, ఢిల్లీ లోని ఏపీ భవన్ కేంద్రంగా, ఎటువంటి ప్రత్యేక ఆర్ధిక ప్రయోజనాలు లేని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విధులు నిర్వర్తించే క్రమంలో… రాష్ట్రా పర్యటనకు వస్తే… రాష్ట్ర ఫ్రభుత్వ అతిధిగా పరిగణించబడుతారని సీఎస్ తన ఉత్తర్వులలో స్పష్టంచేసారు.

#విజయసాయిరెడ్డి #వైసీపీ #ఆంధ్రప్రదేశ్‌ #ఏపీభవన్ #రాష్ట్రాఅతిధి #ప్రత్యేకప్రతినిధి #జగన్‌ప్రభుత్వం

About The Author