హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కళాశాలలో హరితహారం…
హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కళాశాలలో హరితహారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రోజారాణి తో పాటు 500 మంది విద్యార్థినులు, అటవీశాఖ అధికారులు పాల్గొని కళాశాల ఆవరణలో భారీగా మొక్కలు నాటారు.
అందరూ కలిసి సుమారు ఆరు వందల మొక్కలు నాటి, సంరక్షణ కోసం ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకున్నారు. విద్యార్థినులు మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిలో ఉండాలని ప్రిన్సిపాల్ రోజారాణి సూచించారు. మొక్కలు పెంచటం వల్ల వాతావరణ కాలుష్యం నియంత్రించడంతో పాటు జీవావరణ వనరులు పెరుగుతాయని అదనపు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి మునీంద్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మొక్కలు నాటిన విద్యార్థులు రోజూ నీళ్లు పోస్తూ, కాలేజీ నుండి వెళ్లేంతవరకు మొక్కలను సంరక్షించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కాలేజీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.