సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ – ఔషధ గుణాలు…

కొర్రలు యొక్క ఉపయోగాలు –

* కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .

* శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.

* కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.

* శరీరం నందు వేడిని కలిగించును.

* జ్వరమును, కఫమును హరించును .

* జీర్ణశక్తిని పెంచును.

* రక్తమును వృద్దిచేయును.

* నడుముకు మంచి శక్తిని ఇచ్చును.

* అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.

* గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.

* కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .

* కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .

* కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .

* కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.

* కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.

* కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.

సామలు యొక్క ఉపయోగాలు –

* సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును.

* చలవ , వాతమును చేయును .

* మలమును బంధించును .

* శరీరము నందు కఫమును , పైత్యమును హరించును .

* ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.

* గుండెల్లో మంటకు మంచి ఔషదం.

* కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం .

రాగుల యొక్క ఉపయోగాలు –

* వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు .

* రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును.

* శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును .

* మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును .

* రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును.

* రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును.

* కఫాన్ని పెంచును. చలవ చేయును .

* శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.

* ఆకలిదప్పికలను అణుచును.

* విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును.

* రాగుల్లో పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .

* రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును .

* మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని
కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.

* రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును .

* రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.

జొన్నలు –

* రుచికి వెగటుగా ఉండును.

* శరీరం నందు కఫమును, పైత్యాన్ని హరించును .

* వీర్యవృద్ధి బలాన్ని ఇచ్చును.

* జొన్నలలో ఎరుపు, తెలుపు, పసుపు మూడురంగుల జాతులు ఉండును.

* జొన్నలలోని మాంసకృత్తుల్లో మనకు అవసరమయిన అన్ని ఎమైనో ఆసిడ్స్ తగినంతగా లభ్యం అవుతాయి. వీటిలో విటమిన్ B కాంప్లెక్స్ మరియు సెల్యూలోజులు సమృద్ధిగా లభిస్తాయి.

* జొన్నపిండితో తయారుచేసిన రొట్టెలను ప్రతిరోజు స్వీకరిస్తుంటే మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేయును . మలబద్ధకాన్ని తగ్గించి వేయును . జీర్ణశక్తి తక్కువ ఉన్నవారు తినరాదు.

* జొన్నలలో అధికంగా ఉన్న “ఫైటేట్స్ ” అనే పదార్థం వలన మిగతా ఆహారపదార్ధాలలోని క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు శరీరానికి పట్టుట కష్టం అగును.కాబట్టి జొన్నలను పరిశుభ్రముగా శుద్ధిచేసి పిండిమరలో వేసి మెత్తగా పిండిచేసి ఆహారంలో ఉపయోగిస్తుంటే ఫైటేట్స్ అడ్డురావు. దీనివల్ల ఐరెన్ , క్యాల్షియం ఒంటికి పట్టును .

* మంచిగా శుద్ది చేసిన జొన్నపిండిని పాలతో కాని మజ్జిగలో కాని కలిపి తాగుతుంటే మొలలు , అజీర్తి , B1 , B2 లోపముతో బాధపడువారికి మంచి ఔషధంగా పనిచేయును .

* 100 గ్రాములు జొన్నలలో పిండి పదార్దాలు 73 గ్రా, మాంసకృత్తులు 10.5 గ్రా , కొవ్వులు 1.7 గ్రా , ఫాస్ఫరస్ 286 మి.గ్రా , కాల్షియం 20 మి.గ్రా , ఐరన్ 6 మి.గ్రా , సోడియం 7 మి.గ్రా , పొటాషియం 130 మి.గ్రా , విటమిన్స్ A – ౧౪0 , I.U ,B -345 మి.గ్రా , B2 – 365 మి.గ్రా , నియాసిన్ 1.7 మి.గ్రా ఉన్నాయి. ఇవి జీర్ణం అగుటకు 3 గంటలు పట్టును .

* జొన్నలను కడుపులో గుల్మాలు ఉన్నవారు , మొలలు సమస్య ఉన్నవారు తీసుకోరాదు . జొన్నలు అధికంగా తీసుకోవడం వలన నేత్రసంబంధ సమస్యలు వస్తాయి.

* జొన్నలకు విరుగుళ్లు పాలు , నెయ్యి, మిఠాయి
వాము .

సజ్జలు –

* 100 గ్రాముల సజ్జలలో కార్బోహైడ్రేట్స్ 66 గ్రా , ప్రొటీన్స్ 10 గ్రా, ఫాట్స్ 4.5 గ్రా , కాల్షియం 50 గ్రా , ఫాస్ఫరస్ 350 మి.గ్రా , ఐరన్ 10 మి.గ్రా , సోడియం 11 మి.గ్రా , పొటాషియం 30 మి.గ్రా , విటమిన్స్ A -2205 I .U , B1 – 329 మి.గ్రా , నియాసిన్ 3.2 మి.గ్రా ఆక్సాలిక్ ఆసిడ్ 14 .5 మి.గ్రా ఉన్నాయి .

* 100 గ్రా సజ్జలు జీర్ణం అగుటకు మూడున్నర గంటలు పడుతుంది.

* సజ్జలలో మాంసకృత్తులుకు అవసరం అయిన ఆర్డీనైన్ మొదలుకొని హెలైన్ వంటి ఎమైనో ఆసిడ్స్ తగినంతగా ఉన్నాయి. సజ్జలలో ఇంకా ఐరన్ , విటమిన్ A , B లు కూడా పుష్కలంగా ఉన్నాయి . ఇవి మంచి బలవర్థకమైన ఆహారంగా చెప్పవచ్చు.

* సజ్జలను మెత్తగా పిండిచేసి తయారుచేసిన రొట్టెలను తేనెతో కలిపి ప్రతినిత్యం ఉదయం పూట వాడుచున్న శరీరముకు మంచి బలం కలుగును.

* నిద్ర పట్టనివారు , మొలల వ్యాధితో బాధపడేవారు , నరాల బలహీనంతో బాధపడేవారు పైనచెప్పినట్టు సజ్జరొట్టెలను తేనెతో కలిపి తీసుకొనుచున్న మంచి ఫలితం కనిపించును.

* సజ్జలను అధికంగా తీసుకొనుచున్న యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. కావున మితముగా తీసికొనవలెను.

* మధుమేహ వ్యాధిగ్రస్థులు , శుక్రంనష్టం , తెల్లబట్ట సమస్య ఉన్నవారు, మలబద్దకం, క్షయ , గనేరియా , సిఫిలిస్ వంటి సుఖవ్యాధులు ఉన్నవారు సజ్జలు తినరాదు.

గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

About The Author