సిద్దిపేట లో హరితహారం అవగాహన సదస్సు.


• హరితహారం అంటే ప్రహసనంగా సాగద్దు రాసి కంటే వాసి ముఖ్యం.
• ఇప్పుడు పెట్టిన మొక్కలు ఇదేండ్లకు వృక్షాలు గా మారి మన కళ్ళముందు ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది.
• నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపిటిసిలు సమష్టిగా రెండు వేల మొక్కలు నాటాలి.
• గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా, స్మశానవాటికలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటాలి. .
• గ్రామాల్లో ముఖ్యానంగా గౌడ్స్, గోళ్లకుర్మలు, ముదిరాజ్ లకే ఎక్కువ భూములు ఉంటాయి.
• కష్టపడే వారి వద్దనే భూములు ఉండడం సంతోషకారం.
• ప్రతి ఉరికి వంద రైతులను ఎంపిక చేసి వారి పొలాల గట్లపై వారికి నచ్చిన మొక్కలు పెట్టుకునేలా ప్రోత్సహించాలి.
• వీరిలో 25 మంది గౌడ్స్, 25 మంది ముదిరాజ్, 25 మంది గొల్ల కూర్మలతో పాటు మరో 25 మందిని ఇతరులను ఎంపిక చేయాలి.
• ఒక్కొక్క మొక్క వెనుక చాలా కష్టం, శ్రమ, డబ్బు ఉంటది, మొక్కల పెంపకాన్ని సీరియస్ గా తీసుకోవాలి
• రైతులకు లాభం కలిగే మొక్కలే ఇద్దాం, ఆ మొక్కలతో వారికి లాభం ఉంటుందనిపిస్తే కష్టపడతారు
• ఇంటింటికి పండ్ల మొక్కలు ఇద్దాం.
• పనిని గౌరవించాలి, పని చేసే అధికారులను, ప్రజాప్రతినిధులను అబినందించాలి.
• అడవుల యొక్క ప్రాధాన్యత ఈ తరం పిల్లలకు తెలపాలి.

About The Author