పూరీ జగన్నాథ్ ఆలయంలో సైటింస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు…?
*ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం దేశంలోనే పేరెన్నికగన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ, విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు.*
*అయితే ఇంతటి ప్రతిష్ట , ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలూ ఉన్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం అవేంటో చూద్దాం.*
*మొదటిది: తనంతతానే ఆగిపోయే రథం.. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు.*
*రెండోది: నీడ కనిపించని గోపురం జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు . సూర్యుడు వచ్చినా నీడ పడదు . ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు.*
*మూడోది: గాలికి వ్యతిరేకదిశలో ఎగిరే జెండా ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురుతుంటుంది. కానీ పూరీ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .*
*నాలుగోది: మనవైపే చూసే చక్రం పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా అది మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది .*
*ఐదోది: ఆలయంపై ఎగరని పక్షులు ఇది మరో వింత ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు.*
*ఆరోది: ఆలయంలో వినిపించని అలల సవ్వడి ఇదో విచిత్రం సముద్ర తీరాన కొలువుతీరిన ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్ర హోరు ఆలయంలో వినిపించదు . మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది .*
*ఏడోది: ఘుమఘుమల ప్రసాదం పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. అయితే ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదు. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలకు ఘుమఘుమలాడుతాయి.*