చిన్నపిల్లల వ్యాధులు హరించుటకు సులభ ఔషధ యోగాలు – 1


చిన్నపిల్లల వ్యాధులు హరించుటకు సులభ ఔషధ యోగాలు – 1

* పిల్లలకు ప్రతిరోజు తలంటుస్నానం చేయిస్తూ తలకు మంచిరకం గవ్వపలుకు సాంబ్రాణితో ధూపం వేయుచుండిన పిల్లల తలలో కురుపులు తగ్గును.
* చిన్నపిల్లలకు చిక్కటిపాలు ఇవ్వడం వలన అజీర్ణం చేసి దగ్గు వచ్చును. అందువలన పాలు పలుచగా చేసి ఇవ్వడం వలన దగ్గు తగ్గును.
* ప్రతినిత్యం రాత్రి పడుకునేముందు 125 ml పాలలో వేయించిన ఆవాలచూర్ణం కలిపి తాగించుచున్న యెడల చిన్నపిల్లలు పక్కలో మూత్రము పోయు అలవాటు తగ్గిపోవును .
* చితగ్గొట్టిన నీరుల్లిపాయను గాని యుకలిఫ్టస్ ఆయిల్ గాని వాసన చూపించిన యెడల చంటిబిడ్డల గుణము తగ్గును. ఆ తరువాత ఆముదము పెట్టిన యెడల ఆ వ్యాధి మరలా రాకుండా ఉండును. పిల్లలకు అజీర్తి , జ్వరం కలగకుండా చూచుకొనుచుండిన యెడల చంటిబిడ్డల గుణము అను వ్యాధి సంపూర్ణంగా పోవును .
* శిశువు పుట్టిన దగ్గర నుంచి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చువరకు ప్రతిరోజూ నువ్వులనూనె ఒంటికి రాచి రెండు గంటలు ఆగిన తరువాత నలుగుబెట్టి స్నానం చేయించుచుండిన యెడల శరీరం నందలి ఎముకలు మిక్కిలి గట్టిబడి త్వరగా విరగకుండా ఉండును.
* మర్రి ఊడలు మెత్తగా నూరి చిక్కని గంధము తీసి నాలుక మీద వేసి వ్రేలితో రుద్దుతున్న యెడల క్రమముగా మాటలు వచ్చును. ఈ ఊడల రసము లొపలికి పోయినను ఎటువంటి సమస్య ఉండదు .
* చిన్నపిల్లలకు జలుబుచేసిన రోజున తమలపాకులు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపై , పొట్టపై , తలపైన వేసి కట్టుకట్టుచున్న జలుబులు హరించిపొవును .
* చిన్నపిల్లలకు కడుపునొప్పి వచ్చుచున్న నీరుల్లిపాయను కుమ్ములో ఉడికించి దంచి రసము తీసి కడుపునొప్పితో బాధపడుతున్న పిల్లలకు రెండున్నర గ్రాములు తాగించవలెను . ఇలా రెండుమూడు సార్లు తాగించిన చిన్నపిల్లల కడుపునొప్పి హరించును .
* కడుపులో నులిపురుగులతో ఇబ్బంది పడుతున్న చిన్నపిల్లలకు సాయంత్రం పూట ఒకటి లేక రెండు అక్రోటు పండ్లను తినిపించుచుండిన కడుపులో ఎలికపాములు , నులిపురుగులు బయటకి పోవును .
* పొంగించిన ఇంగువ , నల్ల ఉప్పు సమభాగాలుగా కలిపి చూర్ణించి పూటకు చిటికెడు చొప్పున తేనెతో కలిపి తినిపించుచుండిన చిన్నపిల్లల కడుపుబ్బరం తగ్గును.
* చిన్నపిల్లలకు విరేచనములు అగుచున్న నీరుల్లిపాయలను నలుగగొట్టి రసం తీయవలెను . ఆ రసము నందు మండుచున్న రావి చెట్టు కట్టెల నిప్పులను పడవేసి ఆర్పవలెను . ఆ తరువాత ఆ బొగ్గులను తీసి చూర్ణం చేసుకొని ఉంచుకుని రావి కట్టెల నిప్పులు ముంచబడిన నీరుల్లి రసం రెండున్నర గ్రాములలో ఒక గ్రాము రావిబొగ్గుల చూర్ణం కలిపి ఒక మోతాదుగా ఇవ్వవలెను . ఇలా రోజుకు రెండుసార్లు చొప్పున మూడురోజుల పాటు ఇవ్వవలెను . ఎటువంటి విరేచనాలు అయినా తగ్గును.
* పాలుతాగే పిల్లలు పాలు కక్కుచున్న పిల్లలు పాలు తాగే ముందు తాగిన తరువాత కొంతసేపటికి 4 చుక్కలు నిమ్మకాయ రసమును త్రాగించుచున్న యెడల పిల్లలు పాలు కక్కుకునే రోగం హరించును .
తరవాతి పోస్టులో మరిన్ని పిల్లలకు సంబంధించిన ఔషధయోగాలు తెలియచేస్తాను .
గమనిక –
నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల – 350 రూపాయలు .
ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల – 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034

About The Author