43లక్షల మందికి వర్తింపచేయనున్న’అమ్మఒడి’
జగనన్న అమ్మ ఒడి పథకాన్ని రాష్ట్రంలో 43 లక్షల మందికి వర్తింపజేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. విద్యాశాఖకు ఈ బడ్జెట్లో 32 వేల కోట్లు కేటాయించామన్నారు.అయితే, రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులు ఉంటే 43 లక్షల మందికే పథకం వర్తింపజేస్తే ఎలాగని సభ్యులు ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి.. తల్లిని దృష్టిలో పెట్టుకొని అమ్మ ఒడి పథకం రూపొందించామని తెలిపారు. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లికి మాత్రమే 15 వేల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు.