నలభై ఏళ్ల అనుభవం ఉన్నా రూల్స్ పాటించాల్సిందే.


నలభై ఏళ్ల అనుభవం ఉన్నా రూల్స్ పాటించాల్సిందే.

ఏపీ శాసనసభలో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు యత్నిస్తుండటంతో, టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ స్పీకర్ మండిపడ్డారు. సీట్ల కేటాయింపుపై అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సభలో మాట్లాడారు.

సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ..’ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి అంశాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం సీట్ల కేటాయింపు జరిగింది. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. 40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి అయినా రూల్స్ పాటించాల్సిందే. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా ఎవరైనా చట్టసభలోనే కూర్చుంటారు. స్పీకర్‌కు రూల్స్ మీరే చెబుతున్నారు.

గతంలో ఉన్నప్పుడు మీరెలా ప్రవర్తించారు?. స్పీకర్‌ను అగౌరవపరుస్తూ మాట్లాడడం సరికాదు. మాకు సంఖ్యాబలం ఎక్కువున్నా.. మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాతో మీరు ఎలా వ్యవహరించారో తెలుసుకోండి. సానుభూతి కోసం పాకులాడ్డం మంచిది కాదని’ జగన్ పేర్కొన్నారు.

About The Author