సముద్రాలు దాటి దాక్కున్న వాడిని కూడా లాక్కొచ్చి లాకప్ లో వేసింది…


సముద్రాలు దాటి దాక్కున్న వాడిని కూడా లాక్కొచ్చి లాకప్ లో వేసింది…
దుబాయి నుంచి కొల్లం వరకూ వాడిని ఈడ్చుకొచ్చింది..

ఈ ఫొటోలో మీకు కనిపిస్తున్న అమ్మాయి పేరు మెరిన్ జోసెఫ్. కొట్టాయంకు చెందిన ఈమె 2012 ఐపీఎస్ బ్యాచ్… చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్.. ఏ కేసునైనా టేకప్ చేసిందంటే దాని అంతు తేల్చేదాకా నిద్రపోదు. కొద్దిరోజుల కిందటే కేరళ రాష్ట్రం, కొల్లంలో కమిషనర్ గా ఛార్జి తీసుకుంది. వచ్చీరాగానే పాత కేసులను పరిశీలిస్తున్న తనకు ఓ మైనర్ బాలిక రేప్ కేసు కనిపించింది. ఆ కేసు వివరాలను పూర్తిగా పరిశీలించింది. ఓ మైనర్ బాలికను బెదిరించి, మూడు నెలలపాటూ దారుణంగా తనలైంగిక వాంఛలు తీర్చుకున్నాడు ఓ కామాంధుడు. ఆ నీచుడి పేరు సునీల్ కుమార్ బర్దన్. ఆ నీచుడిని పట్టుకుందామంటే కుదరలేదు.. సీన్ కట్ చేస్తే దుబాయిలో మకాం పెట్టాడు ఆ కామాంధుడు. పోలీసులు కూడా చేసేదేమీ లేక ఆ కేసును పక్కనపెట్టేశారు. జరిగిన దాన్నే తలచుకొని ఆ బాలిక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ నీచుడిని బాలికకు పరిచయం చేసిన వాళ్ళ చిన్నాన్న కూడా కొద్దిరోజుల్లోనే.. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇదంతా చదివిన జోసెఫ్ రగిలిపోయింది. మరణించిన వారికి న్యాయం చేయాలనుకొంది. ఎలాగైనా ఆ నీచుడికి శిక్ష వేయించాలని డిసైడ్ అయిపొయింది. అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ నీచుడిని భారత్ కు రప్పించేందుకు కావాల్సిన ప్రొసీజర్ ప్రారంభించింది. ఢిల్లీలోని సిబిఐ కార్యాలయం దగ్గర నుంచి దర్యాప్తు ప్రారంభించింది. ఆ నీచుడు దుబాయిలోనే వున్నాడని నిర్ధారించుకుంది. సౌదీలోని ఇంటర్ పోల్ ను కాంటాక్ట్ అయ్యింది. ఇండియన్ ఎంబసీని కదిలించింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్, క్రైమ్ బ్రాంచ్ అంటూ వివరాలనూ సేకరిస్తూ వెళ్ళింది. అయితే ఏ ఒక్కరూ సహకరించలేదు. ఆ డాక్యుమెంట్లు కావాలి.. ఈ డాక్యుమెంట్లు కావాలి.. అంటూ విసిగించారు. నీకెందుకంత ఇంట్రస్టూ అంటూ సూటిపోటి మాటలూ.. అయినా విడిచి పెట్టలేదు. ఓ టీంను తీసుకుని సౌదీ విమానం ఎక్కేసింది. అక్కడి అధికారులకు కేసును వివరించింది. ఇండియన్ ఎంబసీ అధికారులతోనూ మాట్లాడించింది. ఎలాగైతేనేం చివరకు ఆ నీచుడిని దుబాయిలోనే అరెస్టు చేసింది. ఆ కామాంధుడిని తీసుకుని వచ్చి.. కేరళ జైల్లో పడేసింది. అంతటితో ఆగకుండా వాడిపై పక్కాగా ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి కోర్టులో హాజరు పరచింది. బెయిల్ రాకుండా సెక్షన్లను పక్కాగా నమోదు చేయించింది. దట్ ఈజ్ జోసెఫ్.. త్వరలోనే నిందితుడికి శిక్ష పడుతుండడంతో పైనుంచి చూస్తున్న ఆ అమ్మాయి ఆత్మ కూడా బహుశా జోసెఫ్ కు కృతజ్ఞత చెప్పుకునే ఉంటుంది. నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుందో జోసెఫ్ మరొకసారి రుజువు చేసింది. ఇప్పడు కేరళ పోలీస్ టీం మొత్తం జోసెఫ్ కు సెల్యూట్ కొడుతోంది.

About The Author