అత్తిపండు గురించి సంపూర్ణ వివరణ…

అత్తిపండు విలక్షణమైనది. అత్తిపండు పచ్చిగా ఉన్నప్పుడు తినవచ్చు . పచ్చిది త్వరగా కుళ్లిపోవును . ఈ పచ్చి అత్తిపండును గుండ్రని బిళ్లలుగా తురిమి ఎండబెడతారు. ఈ బిళ్ళలు చాలాకాలం నిలువ ఉంటాయి. అందుకే అత్తిపండును ఎండుఫలంగా పరిగణిస్తారు. అత్తిపండులో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఈ పిండిపదార్థం ఫలచక్కెర రూపంలో ఉండి త్వరగా జీర్ణం అయ్యి శరీరానికి వంటబట్టి శక్తి చేకూరును .

100 గ్రాముల అత్తిపండులో ఉండే పోషక విలువలు –

* పిండిపదార్ధాలు – 17.1 గ్రా .

* కొవ్వుపదార్దాలు – 0.2 గ్రా .

* మాంసకృత్తులు – 1.3 గ్రా .

* క్యాల్షియం – 60 మి . గ్రా .

* భాస్వరం – 30 గ్రా .

* మెగ్నిషియం – 20 మి . గ్రా .

* ఇనుము – 1.2 గ్రా .

* సోడియం – 2 మి.గ్రా .

* పొటాషియం – 190 గ్రా .

* పీచుపదార్థం – 2.2 గ్రా .

ఔషధోపయొగములు –

* పీచు పదార్థం ఎక్కువుగా ఉండటం వలన మలబద్దకం నివారిస్తుంది.

* వాతనొప్పులు , చర్మవ్యాధులు , పిత్తాశయ , మూత్రాశయ రాళ్లు , కాలేయం వాపు , తెల్లబట్ట మొదలగు వ్యాధులను నయంచేస్తుంది .

* అంజీరపండ్లు తేనెతో కలిపి తీసుకుంటే కాలేయం గట్టిపడే సమస్య , చిన్నగా అవ్వడం , కామెర్ల వ్యాధిని నయం చేస్తుంది .

* అతి తక్కువ క్యాలరీలు ఉన్నపండు కూడా అత్తిపండు మాత్రమే .

మరెన్నో ఔషధయొగాలు తరువాత పోస్టులలో వివరిస్తాను .

గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల – 350 రూపాయలు .

ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల – 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని

ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్

9885030034

మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కాళహస్తి వేంకటేశ్వరరావు .

About The Author