వనపర్తిలో ఘనంగా సినారె 88వ జయంతి ఉత్సవాలు…
– రాష్ట్రం నలుమూలల నుండి హాజరయిన కవులు, కళాకారులు, సాహితీప్రియులు
– నాగవరం శ్రీనివాస పద్మావతి గార్డెన్స్ లో కవి సమ్మేళనం
– సాయంత్రం ఐదు గంటలకు పాన్ గల్ రహదారి నుండి పాలిటెక్నిక్ మైదానం వరకు తెలంగాణ సాంస్కృతిక కళల ప్రదర్శన
– విశ్వంభర (పాలిటెక్నిక్) ప్రాంగణంలో సాయంత్రం రామప్ప నాటక ప్రదర్శన
– పలు సాంస్కృతిక ప్రదర్శనలు, పేరిణీ నృత్యం, ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు వందేమాతరం శ్రీనివాస్ సంగీత విభావరి
వనపర్తిలో పట్టణంలో సినారె 88వ జయంతి సంధర్భంగా ఏర్పాటు చేసిన ఉత్సవాలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి అధ్యక్ష్యతన తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందినీ సిద్దారెడ్డి గారు ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందినీ సిద్దారెడ్డి గారు, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ గారు, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ఆచార్య ఎస్వీ రామారావు గారు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ అధ్యక్షులు బాద్మి శివకుమార్ గారు, తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జుర్రు చెన్నయ్య గారు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు