హలల్ అంటే ఏమిటి…? ఎలా తాయూరు చేస్తారు…

హలాల్ చేసిన మాంసం ఆరోగ్యానికి హానికరం ఇప్పటికే అనేక దేశాలు బ్యాన్ చేసినవి హలాల్ పద్ధతిని .

హలాల్ చేసిన మాంసాన్ని యూదులు తినరు
కోషెర్ (యూదుల పద్ధతి ) ద్వారా చేసిన మాంసాన్ని ముస్లిములు తినరు .
జట్కా( సిక్కు/హిందూ ) సాంప్రదాయం ద్వారా చేసిన మాంసాన్ని ముస్లిములు . యూదులు తినరు . సిక్కులు కూడా హలాల్ మాంసాన్ని తినరు .కేవలం జట్కా మాంసాన్ని మాత్రమే తింటారు
చైనావాళ్ళు చచ్చిన దానిని తినరు .

ఏదో గొప్ప లాగా హిందువులే హలాల్ చేసావా అని అడిగి మరి కొంటారు . ఆఖరికి గ్రామ అధిష్టాన దేవతల పండుగకి కూడా హలాల్ చేసే తింటారు ( నిజాం పాలన సమయంలో అలవాటైన హాంగ్ ఓవర్) . అమ్మవారికి బలి ఇచ్చా అంటాడు దానిని కోసే వాడేమో ” లాహి ఇలాహి ఇల్లల్లాః మహామ్మదూర్ రాసూలల్లాహ్ “( అల్లాః మాత్రమె దేవుడు , మరే దేవుడు లేదు , మహమ్మద్ మా ఆఖరిప్రవక్త ) అంటూ మక్కా వైపు దాని ముఖం పెట్టి దాని పీక కోస్తాడు దాని అర్ధం మనకి తెలిసి చస్తే కదా …?

అసలు హలాల్ ఎలా చేస్తారు . హలాల్ అంటే ఏమిటి ..?

జంతువు ప్రాణం తీసే కసాయి జంతువును బలవంతంగా పడుకోబెట్టి ,మక్కా వైపు దాని ముఖం పెట్టి ” లాహి ఇలాహి ఇల్లల్లాః మహామ్మదూర్ రాసూలల్లాహ్ “( అల్లాః మాత్రమె దేవుడు , మరే దేవుడు లేదు , మహమ్మద్ మా ఆఖరిప్రవక్త ) అంటూ జంతువు యొక్క jagular vein గండిక సిర( గళ సిర)( తల నుండి మొండానికి రక్తం తీసుకువెళ్ళే సిర) ను కోస్తాడు . అలా కొస్తే చెడు రక్తం అంతా పోయి నొప్పి లేకుండా చనిపోతుందని (నమ్మకంతో ) అలా చేస్తూ ఉంటారు . మరియు ఖురాన్ ప్రకారం రక్తాన్ని మాంసం తో కలపవద్దంటూ ఒక వార్నింగ్ ఉంటుంది . అందుకే సగం కోసి వదిలేస్తారు . వీరు మిస్ అవుతున్న లాజిక్ ఏమిటంటే నొప్పి అనేది నరాల ద్వారా మెదడుకి సంకేతంగా వెళ్తుంది ,తల వైపు ఉండే నరాలు ఏ జంతువుకైనా మెదడు ద్వారా వెన్నుముకకు ఆవహించి ఉంటాయి . జంతువు మెడను కొస్తే దానికి వంద శాతం నొప్పి తెలుస్తుంది , దానిలో అవయవాలు ఒక్కొక్కటి పనిచేయడం మానేయడం ద్వారా హలాల్ చేయబడిన జంతువు చనిపోతుంది . ప్రతి కండకి కంటికి కనిపించని సూక్ష్మ ధమనులు సిరలు ఉంటాయి , వాటిల్లో రక్తం ఉంటుంది . రక్తం కలవకుండా మాంసం తినడం అనేది సాధ్యంకాదు . పైగా ఆ జంతువును బలవంతంగా పడుకోబెట్టడం , భయపెట్టడం చుట్టూ జనాలు అరుస్తూ ఉండడం చేత జంతువు శరీరం లోకి , మాంసం లోకి స్ట్రెస్ హార్మోన్స్ విడుదల చేయబడతాయి . ఆ హార్మోనులు కలిసిన మాంసం తిన్నవారికి సమస్యలు రావచ్చు అందుకంటే గుర్రం యొక్క శరీరానికి విషం ఎక్కించి దాని antibodies నుండి తీసే పాము యొక్క విషం విరుగుడు మనకి పనిచేస్తున్నప్పుడు . మనలాంటి రక్త మాంసాలతో నిర్మితమైన ఇంకో జీవి హార్మోన్స్ మనకి పనిచేయవని ఎలా చెప్తాం …?

జట్కా సాంప్రదాయం అంటే ఏమిటి ..?

ఇది ఉత్తర భారతం లో హిందువులు ఆచరిస్తూనే ఉన్నారు , గ్రామ దేవతల కార్యక్రమాలలో తమిళనాడు , ఆంధ్రాలో ఈ పద్ధతి లోనే మాంసం కోసం ఉపయోగించే ప్రాణి యొక్క ప్రాణం తీస్తారు .

జట్కా అంటే పెద్ద ఖడ్గంతో ఒక్క వేటుతో జంతువు యొక్క తల మొండెం వేరు చేయడం . దీని ద్వారా జంతువు కొంతలో కొంత ఏమి అర్ధం కాకుండానే చనిపోతుంది . దీనిలో స్ట్రెస్ హార్మోన్స్ దానితో పోలిస్తే తక్కువగా ఉంటాయి .
ఈ జట్కా పద్దతిని మన హిందువులైన కటిక సోదరులు చాలా చోట్ల వాడుతుంటారు .

ఒకవేళ తింటే కనుక చాలావరకు జట్కా పద్ధతి లో చేయబడిన మాంసాన్ని మాత్రమె తినండి.

About The Author