కాళేశ్వరం ప్రాజెక్టు గురించి KCR ప్రెస్సుమీట్…


కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాణహిత నుండి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాలు సహా 80 శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తిచేసుకున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 150 కిలో మీటర్ల మేర నీరు నిలిచి ఉండటంతో రివర్ బేసిన్ ను పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కలిసి రెండు హెలికాప్టర్‌లలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.

తొలుత ముఖ్యమంత్రి మేడిగడ్డ హెలిప్యాడ్ నుంచి బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ పొడవునా చాలా దూరం కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు పూలు, పసుపు, కుంకుమతో కూడిన వాయినం సమర్పించారు. అనంతరం నాణాలను నదిలోకి జారవిడిచారు. ఈ సందర్భంగా మేడిగడ్డ ఎగువన ప్రాణహిత నుండి వస్తున్న వరద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటి వరకు ఈ సీజన్ లో మేడిగడ్డ నుండి కిందికి ఎంత వరద వెళ్లింది అని అధికారులను అడిగారు. ఈ సీజన్ లో 300 టీఎంసీల నీరు కిందికి వెళ్లినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పై నుంచి వచ్చే వరదకు అనుగుణంగా గేట్లను ఎత్తాలని వీలున్నంత వరకు నదిలో నీటి మట్టాన్ని మెయిన్ టెయిన్ చేయాలని అధికారులకు సూచించారు. గోదావరిలో మొత్తం ఫ్లడ్స్ తగ్గిన తర్వాత గేట్స్ మూసివేయాలని సీఎం సూచించారు.

మేడిగడ్డ బ్యారేజిని సకాలంలో నిర్మించి ఈ సీజన్ కు అందించిన ఎల్ అండ్ టి సంస్థను, ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఆ తర్వాత ఇటివల నిర్వహించిన యాగశాల వద్దకు చేరుకుని కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల నుండి వినతి పత్రాలను తీసుకున్నారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రులు శ్రీ ఈటల రాజేందర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, జెడ్పీ చైర్మన్ శ్రీ పుట్ట మధు, ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నర్సింగ రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రామకృష్ణరావు, ఇరిగేషన్ కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్, సీఎం సెక్రటరీ శ్రీమతి స్మితా సబర్వాల్, ఓఎస్డీ శ్రీ భూపాల్ రెడ్డి, కలెక్టర్ శ్రీ వి. వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈ ఎన్సీ శ్రీ మురళీధర్ రావు, ఈఈ శ్రీ రమణా రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రతినిధి శ్రీ రాజు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకునే ముందు వరకు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజీకి చేరుకునే సమయంలో వర్షం తగ్గిపోయింది. ముఖ్యమంత్రి గోలివాడకు బయలుదేరిన తర్వాత మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాంతంలో మళ్లీ భారీ వర్షం కురిసింది.

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao has instructed the irrigation higher officials to be alert and cautious regarding maintaining the Kaleshwaram project Barrages. He has instructed them to take all precautions and measures while maintaining the gates, as lakhs of cusecs of heavy floodwater is coming from Pranahita.

The CM said he was happy that the Kaleshwaram project aimed at supplying water to 45 Lakh acres, water for the industrial purposes and drinking water purposes to 80 percent of the Telangana state has been completed within a short span of time.

The CM along with the senior officials went for a visit of the Kaleshwaram project in two helicopters to examine the River Basin, where water was stagnated 150 KMs above Medigadda Barrage, the key Barrage in the Kaleshwaram project.

Earlier, the CM from Medigadda helipad reached the barrage. He went for a long walk on the Barrage. On this occasion, the CM offered flowers, Kum Kum, Turmeric to River Godavari. He also dropped coins into the river. He has inquired from the officials details about floodwaters reaching from Pranahita above Medigadda Barrage.

He also inquired from the officials on how much water flowed down Medigadda reservoir in this season so far. The officials informed the CM that in this season so far 300 TMC of water was flown down. The CM asked the officials to open the gates based on the floodwater being received and maintain the water level in the river. After the floods are receded in Godavari, all the gates should be closed, the CM said.

The CM has congratulated the L&T and irrigation officials for completing the Medigadda barrage on time and made it functional this season. Later, the CM visited the Yagashala, which was utilised recently, and received memoranda from the people.

Along with the CM, Ministers, Sri Etela Rajender, Sri E Dayakar Rao, MP Sri J Santosh Kumar, ZP Chairman Sri Putta Madhu, MLA Sri Gandra Venkatramana Reddy, CM Principal Secretary Sri Narsing Rao, Principal Secretary (Finance) Sri Ramakrishna Rao, Irrigation Secretary Sri Somesh Kumar, CM Secretary Ms. Smitha Sabharwal, OSD Sri Bhoopal Reddy, Collector Sri V Venkateswarlu, Irrigation E-in-C Sri Muralidhar Rao, EE Sri Ramana Reddy, L&T Representative Raju participated.

There was heavy rain at the Medigadda Barrage before the CM’s visit. The rain stopped when the CM visited the Barrage. When the CM left for Golivada, there was again heavy rain at Medigadda and Kaleshwaram areas.

About The Author