ఆపరేషన్ చేశారు… కట్టుడుపళ్ళు జారిన సంగతి మరిచారు…
డాక్టర్ల ఘనకార్యాలు ఒక్కొదఫా విచిత్రంగా ఉంటాయి.. 72 ఏళ్ల వృద్ధుడికి కడుపులో గడ్డకు ఆపరేషన్ చేశారు.. ఆపరేషన్ సమయంలో కట్టుడు పళ్ళు ఉంటే తీసేస్తారు. అయితే ఆ విషయం పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో వారం తరువాత ఆ వృద్ధుడికి నోట్లో రక్తం పడటం, ఆహారం మింగుడు పడకపోవడంతో తీసుకొచ్చారు.. ఎక్స్ రే తీసిన డాక్టర్లకు తాము చేసిన తప్పేమిటో తెలిసింది.. వృద్ధుడి గొంతులో కట్టుడుపళ్ళు ఆపరేషన్ సమయంలో గొంతులోకి జారాయని గుర్తించి మళ్లీ ఆపరేషన్ చేసి తీసేశారు… ఈస్ట్ లండన్లో జరిగింది ఈ విచిత్రం….