ఐదేళ్ల బాలికపై పిచ్చి కుక్క తీవ్ర దాడి…


తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ , రాజవొమ్మంగి మండలం
తంటికొండ గ్రామపంచాయతీ పరిధిలోని వట్టిగడ్డ గ్రామానికి చెందిన పల్లి గ్రేస్ పుష్ప(5) అనే బాలిక పై పిచ్చి కుక్క మొహం పై తీవ్రంగా దాడి చేసింది .

వివరాలలోకి వెళితే బుధవారం ఉదయం ఒట్టిగడ్డ గ్రామంలోనే గ్రేస్ పుష్ప అనే బాలిక తన తమ్ముడు తో కలిసి ఇంటికి దగ్గర లొనే ఉన్న టిఫిన్ దుకాణం కి వెళ్లి , టిఫిన్ కొనుక్కొని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా గ్రేస్ పుష్ప పై పిచ్చి కుక్క దాడికి పాల్పడింది .

అది గమనించిన స్థానికులు మరియు కుటుంబ సభ్యులు కుక్కను చదరికొట్టి గాయపడ్డ బాలికను వెంటనే అక్కడ నుండి దగ్గర లోని రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

అక్కడ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిజిహేచ్ కు తరలించారు .

అదే గ్రామంలో మరో వ్యక్తిపై కూడా అదే పిచ్చి కుక్క దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు .

గ్రామాల్లో ఊర కుక్కల బెడద ఎక్కువ అవిందని , కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు మార్లు అర్జీలు చేసిన పటంచుకున్న దాఖలు లేవని ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ఊర కుక్కలు స్వైర విహారం చేయకుండా తగు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు …

About The Author