ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద నీరు…
మొన్నటి వరకు అంతర్రాష్ట్ర వరద ప్రకాశం బ్యారేజీకి పోటెత్తితే, ఇప్పుడు భారీగా లోకల్ వరద నీరు
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు బ్యారేజీకి మొదలైన వరద
మున్నేరు, మధిర వాగుల నుంచి కొనసాగుతున్న నీటిప్రవాహం
ఈ రెండు వాగుల నుంచి బ్యారేజీకి చేరుతున్న 30వేల క్యూసెక్కుల నీరు
మొత్తం 20 గేట్లను అడుగు మేర ఎత్తి కిందకి నీటిని వదిలిన అధికారులు
సముద్రం లో కలుస్తున్న 18500 వేల క్యూసెక్కుల వరద నీరు
మరో 14,500 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదులుతున్న అధికారులు
కొద్దిరోజుల క్రితం వచ్చిన వరదల కారణంగా సుమారుగా 300 టీఎంసీల సముద్రంలోకి
నిండు కుండలా కనిపిస్తున్న ఎగువ, దిగువ భాగాలు
మరో రెండు, మూడు రోజులపాటు ఖమ్మం జిల్లా నుంచి వరద నీరు వచ్చే అవకాశం
వరద కారణంగా వినాయక నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లకు అంతరాయం
ఏటా బ్యారేజీకి దిగువన విగ్రహ నిమజ్జనాలకు ఏర్పాట్లు
బ్యారేజీ 20 గేట్లను ఎత్తడంతో ఈ పనులకు ఆటంకం