విక్రమ్ ల్యాండర్ కోసం రంగంలో దిగిన నాసా….


డీప్ స్పేస్ యాంటెనాలతో హలో అంటూ సంకేతాలు.
న్యూయార్క్: చందమామ ఉపరితలంపై దిగిన అనంతరం జాడ తెలియరాకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ కోసం ఇక ఏకంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలో దిగింది.
హలో అంటూ ఏకధాటిగా జాబిల్లి మీదికి ఏకధాటిగా సంకేతాలను పంపిస్తోంది.
డీప్ స్పేస్ యాంటెన్నాల ద్వారా చంద్రుడి మీదికి నాసా సంకేతాలను పంపిస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔత్సాహిక అంతరిక్ష పరిశోధకుడు స్కాట్ టిల్లీ వెల్లడించారు.
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
స్పెయిన్ లోని మ్యాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని క్యాన్ బెర్రా, కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ ప్రాంతాల్లో నాసాకు డీప్ స్పేస్ స్టేషన్ యాంటెన్నాలు ఉన్నాయి.
వాటి ద్వారా హలో అనే సంకేతాలను పంపిస్తున్నట్లు తెలిపారు.

About The Author