తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈ రోజు శుక్రవారం, ఉదయం 5 గంటల సమయానికి,తిరుమలలో భక్తుల రద్దీసాదారణం,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 గదులలో భక్తులు చేచియున్నారు,ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 10.గంటలు పట్టవచ్చును
నిన్న స్వామివారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు ₹: 3.54 కోట్లు, నిన్న 27,128 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు,
నిన్న 69,727 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది, శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_ సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది ,కావున లెమ్ము స్వామి