యాదాద్రిలో శిల్పి పనులు 15 రోజుల్లో పూర్తి…


శిల్పి పనులు 15 రోజుల్లో పూర్తి ముఖమండపంలో ఫ్లవర్ అమర్చే పనులు ప్రారంభం యాదాద్రిలో ముఖమండపానికి అమర్చనున్న సీలింగ్ పనులను ప్రారంభించిన ఆర్కిటెక్టు ఆనందసాయి
యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం విస్తరణ పనుల్లో శుక్రవారం ముఖమండపంలో సీలింగ్‌కు ఫ్లవర్‌ను అమర్చే పనులను ఆర్కిటెక్టు ఆనందసాయి, స్తపతి డాక్టర్ ఆనందాచారి వేలు ప్రారంభించారు. ఆలయంలో శిల్పి పనులు 15 రోజుల్లో పూర్తి చేసే విధంగా కార్యచరణ ప్రణాళికను పూర్తి చేసేలా పనులు చేపడుతున్నట్లు ఆనందసాయి తెలిపారు. ఈశాన్యంలోని పనులన్నీ వారంలోగా పూర్తి చేయాలని ఉప స్తపతులకు సూచించారు. కొండపైన జరగుతున్న అన్ని పనులను వారు పరిశీలించారు. ఇన్నర్ ప్రాకారంలో జరగుతున్న ఫ్లోరింగ్ పనులు 40 శాతం పూర్తయినట్లు చెప్పారు. అష్టభుజి మండపాల వద్ద జరుగుతున్న పనులను కూడా పరిశీలన చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశించిన విధంగా పనులు పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప స్తపతులు సంజయ్, హేమాద్రి, ఆదిత్య చింజీవి, మోతీలాల్, రామూర్తి, మొగిలి, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు

About The Author