ఇకపై మహారాష్ట్రలో నూ తెరాస…
తెలంగాణ ప్రభుత్వ పాలన విధానాలకు ఫిదా అయిన మరాఠా వాసులు…. నాందేడ్ జిల్లా నుంచి పలువురు రాజకీయ నాయకులు సీఎం కేసీఆర్ సార్ ని కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేస్తాం అవకాశం కల్పించండి అని అభ్యర్థన…
ఒకపక్క దేశంలోని ప్రజలే మేమెందుకు తెలంగాణలో పుట్టలేదని మదన పడుతుంటే,, తెలంగాణలో ఉన్న కొందరు (———) ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభినందించకుండా కళ్ళున్న గుడ్డి వాళ్ళ లాగా నటిస్తున్నారు…
ఇది ఎంత అరుదైన సంఘటన చూడండి ఒక రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చి మమ్మల్ని మీ రాష్ట్రంలో కలుపుకోండి అని వచ్చిండ్రు అంటే ఇంకా ఇంతకంటే పెద్ద ప్రశంశ మరొకటి ఉండదు…
తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ను మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు కలిశారు. నాందేడ్ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి తెరాస అభ్యర్థులుగా తాము పోటీ చేస్తామని సీఎం కేసీఆర్‌కు తెలిపారు. మహారాష్ట్రలోనూ తెరాస ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. అక్కడ తెరాస ఏర్పాటుకు అనుమతించారు.
నాందేడ్ జిల్లా నేతలు కేసీఆర్‌ను కలవడం.. తెరాస ఏర్పాటుకు ఆయన అనుమతి ఇవ్వడంతో మహారాష్ట్రలోనూ పార్టీ కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశముంది. అధినేత అనుమతిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్రలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు బరిలోకి దిగే వీలుంది.