నో హెల్మెట్ మ్యాన్…


హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తయారు చేసే హెల్మెట్ల సైజ్ కంటే.. అతడి తల సైజ్ పెద్దది. దీంతో అతడికి సరిపోయే హెల్మెట్ ను కంపెనీ తయారు చేయలేదు. అందువల్ల అతడు హెల్మెట్ పెట్టుకోలేడు. తప్పెవరిది౟ అతని తలదా౟ హెల్మెట్ దా౟ అంత పెద్ద తలతో పుట్టించిన దేవుడిదా౟ ఇదీ ఇప్పుడు పోలీసులను వేధిస్తున్న ప్రశ్న.
ఉదయ్పూర్ జిల్లాలోని బొడేలిలో నివాముండే జకీర్ మోమన్ అనే వ్యక్తి మాత్రం హెల్మెట్ లేకుండానే యథేచ్ఛగా బైక్పై తిరుగుతున్నాడు. దీంతో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకుని భారీ ఫైన్ వేశారు. కానీ, అతను జరిమానా చెల్లించేందుకు నిరాకరించాడు. ఆ చుట్టుపక్కల పట్టణాలన్నీ వెతికినా తన తలకు సరిపడా హెల్మెట్ దొరకడం లేదని పోలీసుల ఎదుట వాపోయాడు. దయుంచి తన భారీ తలకు ఓ హెల్మెట్ జాడ చెప్పండని వేడుకున్నాడు. కావాలంటే చెక్ చేసుకోండని అక్కడున్న హెల్మెట్లు పెట్టుకుని చూశాడు. ఒక్కటి కూడా అతని తలకు సరిపోలేదు. భారీ తల కారణంగానే హెల్మెట్ లేకుండా తిరుగుతున్నానని.. తనకు ఫైన్ వేయొద్దని పోలీసులకు విన్నవించాడు.

About The Author