ప్రమాదానికి కారణమైన బోటు యజమానులు అరెస్ట్.

గత ఆదివారం దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాధానికి కారణమయిన  వశిష్ట పున్నమి రాయల్ టూరిస్ట్ బోటు యజమానులు 1.కోడిగుడ్ల వెంకటరమణ 2.యాళ్ళ ప్రభావతి 3. ఎర్రంశెట్టి అచ్యుత మణిలను, రాజమండ్రి కే.వి.ఆర్ ట్రావెల్స్ వద్ద పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రంపచోడవరం అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ . ఈరోజు యజమానులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచి రిమాండ్ కు తరలించారు.

  బోటుప్రమాదంలో 64 మంది పెద్దవారు,3 చిన్నపిల్లలు మొత్తం 67 మంది లో 64 మంది యాత్రికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేసి బోటు లో ఎక్కించి సిబ్బంది ఎనిమిది మందితో సహా మొత్తం 75 మంది తో ఉన్న గోదావరిలో పాపికొండల యాత్రకు తీసుకుని వెళ్లి బోటు వెళ్ళవలసిన దారి లో కాకుండా వేరే మార్గం ద్వారా నిర్లక్ష్యంగా డ్రైవర్ నడపడం వలన ,అనుభవములేని డ్రైవర్ ని ఏర్పాటు చేయడం వలన వరద నీటి ఉధృతికి వారు ఏర్పాటు చేసిన బోటు తిరగబడి నీటిలో మునిగిపోయి 34 మంది యాత్రికులు చనిపోవుటకు ,12 మంది ప్రయాణికులు3 బోటు సిబ్బంది జా డ కనిపించకపోవటకు కారకులైన బోటు యాజమాన్యంమరియు టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానులపై దేవీపట్నం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 59/ 2019 U/S 304 (11) R/W34 IPC కేసుగా నమోదు నమోదు  చేయబడినది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రత్యక్షంగా కచ్చులూరు గ్రామస్తులు మరియు, చాలా జాలర్ల చే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన పరారీలో వున్న ముద్దాయిల గురించి స్పెషల్ టీం గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఈ కేసును ఏలూరు రేంజ్ డిఐజి శ్రీ ఏఎస్ ఖాన్ , జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో జాడ తెలియని వారి గురించి తీవ్రంగా గాలింపు చర్యలు జరుపుతున్నామని ఏ ఎస్ పి వకుల్ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

About The Author