సైనికులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మనం ..?


జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లాలో క్వాజాబాగ్ ప్రాంతంలో ఉన్న ATM లోకి ప్రతిరోజూ 24 ఏళ్ళ వయసున్న ఒక యువ సైనికుడు వచ్చి ₹100/- మాత్రమే డ్రా చేసి వెళ్ళేవాడు.
ఇలా ప్రతిరోజూ అతను 100/- మాత్రమే డ్రా చేసేవాడు.
అక్కడ కాపలా ఉన్న వాచ్‌మెన్‌కు అతను అలా 100/- మాత్రమే ప్రతిరోజూ ఎందుకు విత్‌డ్రా చేసేవాడో తెలియక జుట్టు పీక్కునేవాడు.

ఒక రోజు ధైర్యం చేసి ఇలా అడిగాడు: “నువ్వు 100/- మాత్రమే రోజూ ఎందుకు విత్‌డ్రా చేస్తావు.

నేను నా జీవితంలో కొన్ని లక్షల మందిని డబ్బులు డ్రా చేసేవాళ్ళను చూచాను..
నీ లాగా ఇలా రోజూ 100/- మాత్రమే డ్రా చేసి సమయం వ్రృధా చేసుకునే వారిని చూడలేదు ..!

దానికి ఆ యువ సైనికుడు చెప్పిన #సమాధానం: నాకు ఇటీవలే వివాహమైంది, ఈ కల్లోల #జమ్మూకాశ్మీర్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా మా సైనికులు ఇంట్లో వారితో ప్రతిరోజూ మాట్లాడడానికి అవకాశం లేదు.
నేను డబ్బులు డ్రా చేస్తే, నా బ్యాంకు అకౌంటుకు లింక్ అయిన ఫోన్ నంబరుకు మెస్సేజ్ పోతుంది.
ఆ ఫోన్ నా భార్య చేతిలో ఉంటుంది.
నేను బ్రతికున్నానని అదే మా ఇంట్లో వారికి గుర్తు.
వరుసగా రెండు రోజులు మెస్సేజ్ రాకపోతే, నేను #భరతమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయానని వారికి తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు.

ఈ సమాధానం విన్న ఆ వాచ్‌మెన్‌కు ధారాపాతంగా కంటి నీరు ఆగలేదు.

About The Author