టాస్క్ ఫోర్స్ డీఎస్పి అల్లా బక్ష్ కు కేంద్ర హోమ్ మంత్రి మెడల్ ప్రదానం: అందజేసిన రాష్ట్ర హోమ్ మంత్రి

టాస్క్ ఫోర్స్ డీఎస్పీ అల్లా బక్ష్ కు కేంద్ర హోమ్ మంత్రి మెడల్ ను బుధవారం రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత అందజేశారు. ఎక్స్ లెన్స్ సర్వీస్ ఇన్ ట్రైనింగ్ మెడల్‌ను ఆయనకు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు.

మెడల్ ను మంగళగిరి లోని ఏపిఎస్పీ ఆరవ బెటాలియన్ గ్రౌండ్ లో బుధవారం  శిక్షణ ముగిసిన 2018 బ్యాచ్ డీఎస్పీ ల పాసింగ్ అవుట్ పెరేడ్ లో అందజేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ సమక్షంలో జరిగింది. మెడల్ పొందిన వారిని అభినందిస్తూ తీవ్రవాదంపై ఉక్కు పాదం మోపాలని ఆమె పిలుపునిచ్చారు.

About The Author