హార్స్ లీ హిల్స్ ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం

 

మదనపల్లె దగ్గర బి.కొత్తకోట ముఖ్య పర్యాటక కేంద్రం హార్స్ లీ హిల్స్ ఘాట్ రోడ్డులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు కడప జిల్లా రాజంపేట కు చెందిన అన్నమయ్య చారి కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు ఉదయం మూడు ద్విచక్ర వాహనాల్లో హార్స్ లీ హిల్స్ కు చేరుకొని తిరుగు ప్రయాణంలో గంగోత్రి చెరువు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న

ఆర్టీసీబస్సును ఢీకొంది ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు గాయపడ్డ వారి వివరాలు సాయి సుమంత్, జాకీర్, గా తెలిసింది గాయపడినవారిని

మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు మదనపల్లి రూరల్ సీఐ అశోక్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు బైక్ పై త్రిబుల్ డ్రైవింగ్ తో వచ్చారని స్థానికులు చెబుతున్నారు ఇంకో వ్యక్తి ఎవరని అక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకుంటున్నారు

About The Author