బ్యారేజీ వద్ద లభ్యమైన మృతదేహం
ఆత్రేయపురం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారిదిగా భావిస్తున్న మృతదేహం ఒకటి సోమవారం మధ్యాహ్నం పిచుకలంక బ్యారేజీ 52వ గేట్ వద్ద తేలింది. విషయం తెలుసుకున్న ఆత్రేయపురం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై నరేష్ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పటి నుంచి సిబ్బంది బ్యారేజి పొడవునా గాలిస్తున్నట్లు చెప్పారు.