ఏపీలో భారీగా ‘పోస్టల్’ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి…
*ప్రధానాంశాలు:*
*అక్టోబరు 15 నుంచి నవంబరు 14 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం
*అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు ఆన్లైన్ దరఖాస్తు అందుబాటులో
ఇండియా పోస్ట్ ఏపీ పోస్టల్ సర్కిల్ పరిధిలో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.
*గ్రామీణ్ డాక్ సేవక్: 2707 పోస్టులుపోస్టులు.*
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM)
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM)
డాక్ సేవక్ (DS)
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 15.10.2019 నాటికి 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100. పోస్టాఫీసులో ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా.
*ముఖ్యమైన తేదీలు:*
రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం: 15.10.2019
రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2019
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2019
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2019.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..
https://indiapostgdsonline.in/phase4/fee.aspx
ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి క్లిక్ చేయండి..
https://indiapostgdsonline.in/onlinefee/
ఆన్లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
http://indiapostgdsonline.in/phase4/reference.asp
More details Visit official website.
http://appost.in/gdsonline/ ?♂