మంగళవారం అర్థరాత్రి వరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని.. లేకపోతే..?
https://www.facebook.com/9staartv1/videos/2494217000814290/
మంగళవారం అర్థరాత్రి వరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని.. లేకపోతే 5వేల రూట్లను ప్రైవేట్‌కే ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. కార్మికుల సమస్యలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశం సాగింది.
ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లో పటిష్టంగా ఉంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోతాం. 49 అంశాలపై కేబినేట్‌లో చర్చించాం. ఆర్టీసీతో పాటు పలు అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆర్టీసీవాళ్లు అనాలోచితంగా, అర్థరహితంగా సమ్మెకు పోయారు.సమ్మె ఎన్నో దుష్పరిణాలకు దారితీసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు. నేను గతంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. గడువులోగా మీరు జాయిన్ కాకపోతే మిగతా 5వేల రూట్లు కూడా ప్రైవేట్ కే ఇస్తాం. స్టేట్ ఇమేజ్ దెబ్బ తినొద్దని ఈ నిర్ణయం తీసుకున్నాం. 49వేల కార్మికులు పిల్లలు, కుటుంబాలను కలిగిఉన్నారు. ఎవరి పొట్ట కొట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. వాళ్లను అందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. కార్మికులు పునరాలోచించుకుని ఉద్యోగాల్లో చేరతే వారికే బాగుంటుంది. లేకపోతే మీఇష్టం’ అని కేసీఆర్ అన్నారు. కార్మికులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని, యాజమాన్యం అదుపాజ్ఞల్లో పనిచేస్తే ఆర్టీసీ మనగలుగుతుంది అని కేసీఆర్ అన్నారు.