జనసేన తలపెట్టిన “లాంగ్ మార్చ్” అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడిన …


జనసేన తలపెట్టిన “లాంగ్ మార్చ్” అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల కోసం డిమాండ్స్ తో కూడిన హెచ్చరికలు జారీ చేశారు..

◆వైసీపీ కి రెండు వారాలు గడువిస్తున్నాం….

◆ఒక్కొక్క కార్మికునికి 50 వేలు…చనిపోయిన వ్యక్తి కి 5 లక్షలు ఇవ్వాలి….
ప్రజలు రోడ్డుపై కి వచ్చారంటే ప్రభుత్వం విఫలమైందని అర్థం…
రాజకీయాలు చేయడానికి ఇది ఎన్నికల సమయమా…??
2014 లో విభజన కు వ్యతిరేకంగా మాట్లాడిన మేమే…
ఆ దమ్ము చూపించాను కాబట్టే ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మారు.
అధికారం,డబ్బులు కోసం వెంపర్లాడను….
రోడ్లపై తిరగడానికి ఎవరికి సరదాగా ఉండదు…
వైసీపీ నేతలు దత్తపుత్రుడంటూ దుష్ర్పచారం చేస్తున్నారు…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పాలన చేస్తే….నేను వెళ్ళి సినిమా లు చేసుకుంటా…

నాకు రాజకీయాల మీద ఆశలేదు…ప్రజాక్షేమమే ముఖ్యం.

ఎవరు చేయాల్సిన పని వారు చేస్తే నాకు పార్టీ పెట్టే అవసరం లేదు…

వైసీపీ నేతలతో విమర్శించుకోవడం నాకు అవసరమేంటి….?? నాకు కోసం రాదా.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు నన్ను చలింపజేశాయి…

వారికి అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం..

ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం ముఖ్యం కాదు….ప్రజల నమ్మకాన్ని పొందడమే ముఖ్యం….

నాకు పదవులు ముఖ్యం కాదు…..ఎవరైనా కష్టం ఉందని వస్తే ఖచ్చితంగా వారి కోసం పోరాడతా…

పదవులు ఆశించకుండా పెట్టిన పార్టీ జనసేన పార్టీ…

వైసీపీ నేతలపై నాకు ఎలాంటి ధ్వేషంలేదు….మంచి పాలన చేస్తే మెచ్చుకొంటా…

నేను చంద్రబాబు కు కాదు….. కష్టాల్లో ఉన్న ప్రజలకు దత్తపుత్రుడిని…

భవన నిర్మాణ కార్మికులు పనిచేయకపోతే వ్యవస్థ ఆగిపోయింది..

వర్షాలు సాకుగా చూపుతున్నారు…. ఇతర రాష్ట్రాల్లో వర్షాలు లేవా….? అక్కడ ఎందుకు ఇసుక సమస్య లేదు…?

నన్ను అభిమానించిన అభిమానులు కూడా వైసీపీ కి ఓటేశారు….అయినా నేను స్వాగతించా….కానీ ప్రజల నమ్మకాన్ని వైసీపీ పోగొట్టుకుంది.

భవన నిర్మాణ కార్మికుల ను రోడ్డున పడేసిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే లకు జీతాలు తీసుకునే అర్హత లేదు…..

మీరు చేసిన తప్పుకు ఐదు నెలల జీతం తీసుకోకండి…

విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు….ఫ్యాక్షన్ రాజకీయాలకు నేను భయపడను.

నేను ఎక్కడకు వెళ్ళినా అక్కడి ప్రభుత్వాలు నాకు సెక్యూరిటీ కల్పిస్తారు….కానీ ఏపీ లోనే ఇవ్వరు.

సూట్ కేసు కంపెనీ లు పెట్టే విజయసాయిరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు…..కారణం ఓడిపోయినందుకట.

జైలు కు వెళ్లిన వారు కూడా పాలకులు గా మారడం మన దురదృష్టం…

దీనిపై స్పందించకపోతే అమరావతిలో నడుస్తా…..ఎవరు ఆపుతారో చూస్తా….

ప్రత్యేక హోదా కోసం ప్రజలే వదిలేస్తే నేను కేంద్రం తో గొడవపడ్డా….

అలాంటి నన్ను టీం.ఎ, టీం. బి అంటూ విమర్శిస్తున్నారు…

ప్రతి శుక్రవారం కోర్టు కు వెళ్ళేవారు పాలించడం దురదృష్టకరం…

వైసీపీ నేతలు ఎక్కువ చిందులు వేస్తే ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు.

About The Author