నీరాలో ఎన్నో ఔషధగుణాలు
వందల ఏండ్లు నీరాను ఎన్నో జబ్బులకు ఔషధంగా వాడిన దాఖలాలు ఉన్నాయి. సూర్యోదయం కంటే ముం దు ఉండేది నీరా.. అదే మధ్యాహ్నంవరకు ఎండకు కల్లుగా మారుతుంది. నీరా నాన్ ఆల్కహాలిక్. మత్తు ఉండ దు. అందుకే అప్పట్లో దీన్ని పిల్లలకు, బాలింతలకు తాగించేవాళ్లు. నీరా నుం చి బెల్లం తయారు చేస్తారు.
తాటి, ఈత, గిరక తాళ్లు, కొబ్బరి చెట్ల నుంచి ఈ నీరా తీస్త్తారు. నీరా కూడా కొబ్బరి నీళ్ల వంటిదే. వందల ఏండ్ల కింద ఉన్న ఏకైక ఔషధం నీరానే. నీరాపై ముంబై, పుణె వర్సిటీలు అనేక పరిశోధనలుచేశాయి. కేరళ, మహారాష్ట్రలో నీరా ను విక్రయిస్తారు. నీరా మధుమేహ బాధితులకు మంచిదని, ఆరోగ్యానికి ఎంతో మేలని పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి.
Neera is Non Alcoholic Drink…