నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం జగన్ గిఫ్ట్..


ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నందమూరి లక్ష్మీపార్వతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి లక్ష్మీపార్వతి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. నందమూరి తారకరామారావు భార్య అయిన ఆమె చంద్రబాబు మీద విమర్శల దాడి చేసేవారు. నందమూరి లక్ష్మీపార్వతి గతంలో సొంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆమెకు జగన్ ఎలాంటి పదవి ఇస్తారా? అని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, లక్ష్మీపార్వతికి తగిన పదవిని వైఎస్ జగన్ కట్టబెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లక్ష్మీపార్వతికి పురాణాలు, ఇతిహాసాల మీద అపారమైన జ్ఞానం ఉంది. ఆమె ఇంట్లో కూడా దీనికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటాయి.నందమూరి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో.పార్టీలో తనను నమ్ముకుని తనవెంట నడిచిన వారికి జగన్ కీలక పదవులను కట్టబెడుతూ వస్తున్నారు. రోజాకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు. అధికార ప్రతినిధిగా ఉన్న వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఇప్పుడు నందమూరి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

About The Author