జడ్పీ కన్వెన్షన్ సెంటర్ లో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీ
హాజరైన మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు
*మంత్రి పేర్ని నాని :*
అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో గత ప్రభుత్వం కంచె చేను మేసిన చందాన వ్యవహరించింది
పైసా పైసా కష్టార్జితాన్ని అగ్రిగోల్డ్ లో దాచుకుంటే సదరు సంస్థ డిపాజిట్ దారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టింది
బాధితుల పక్షాన నిలబడి ఆదుకోవల్సిన ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించింది
ఫలితంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధితుల కోసం పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమానికి నాడు ప్రతిపక్ష నేతగా జగన్ అండగా నిలిచారు
పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు వెళ్లారు
నాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు రూ.10,000/- లు డిపాజిట్ చేసిన ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందచేస్తున్నాం
తమ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కూడా గడవకముందే ఇచ్చిన మాట ప్రకారం డిపాజిట్ మొత్తం అందచేస్తున్నాం