ఈ రోజు 07-11-2019 ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సాగిన వాదనలు…


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ప్రారంభం…

హాజరైన సీఎస్‌ ఎస్కేజోషి, ఎండీ సునీల్‌శర్మ…

అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌కు హైకోర్టు ఆదేశం…

ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదకలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న – హైకోర్టు…

ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్న హైకోర్టు…

ఐఏఎస్‌ అధికారులు అసమగ్ర నివేదకలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్న హైకోర్టు…

రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి…

మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా ? హైకోర్టు…

స్వయంగా వివరణ ఇస్తున్న ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు…

సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామన్న రామకృష్ణారావు.

మన్నించాలని హైకోర్టును కోరిన రామకృష్ణారావు.

క్షమాపణ కోరడం సమాధానం కాదని వాస్తవాలు చెప్పాలని కోరిన హైకోర్టు…

ఆర్టీసీ ఎండీ… మీరు చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయి… మేం వీటిని పరిగణనలోకి తీసుకోవాలా అన్న..హైకోర్టు…

2-6-2014 నుండి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను మీకు అందించిన తాజా నివేదిక లో పొందుపరిచాం.

కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో మీకు అందించాం. రామకృష్ణ రావు….

కోర్టుకు తప్పుడోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు.. పదాలు వాడారు..హైకోర్టు చీఫ్ జస్టిస్…

నివేదిక పై మరోసారి అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్…

ఋణ పద్దుల కింది కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రా.టు అని తెలివిగా చెబుతున్నారన్న.. హైకోర్టు..

ఇంతవరకు ఏ బడ్జెట్ లో అలా చూడలేదన్న.. హైకోర్టు…

సీ జే అడిగిన ప్రతి ప్రశ్నకి నివేదిక ఆధారంగా లెక్కలు చూపిస్తూ సమాధానం చెప్తున్న రామకృష్ణ రావు.

ఆర్టీసీ ఎండీ సునీల్ పై సీరియస్ అవుతున్న – హైకోర్టు…

ప్రభుత్వం ఇచ్చిన నివేదికను కోర్టు హల్ లో చదివి వినిపిస్తున్న న్యాయస్తానం.

మంత్రికి సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారు.

మంత్రికి తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లే.

క్యాబినెట్ కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారు.

సీఎం ని సైతం తప్పుడు లెక్కలతో స్టేట్ మెంట్ ఇప్పించారు.

అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. – హైకోర్టు…

ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ ఫై విరుచుకుపడ్డ హై కోర్ట్ ఛీఫ్ జస్టిస్…

నా 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఎంత అబద్దాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదు.- హైకోర్టు చీఫ్ జస్టిస్…

మూడు రాష్ట్రాల్లో పనిచేసా హై కోర్ట్ కు ఇలా ఎవరు అబద్దాలు చెప్పలేదు.- హైకోర్టు చీఫ్ జస్టిస్…

మంత్రులకి ముఖ్యమంత్రి కి అబద్ధాలా లెక్కలు చెప్పి మోసం చేస్తున్నారు.- హైకోర్టు…

ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదిక కూడా మంత్రులని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి.- హైకోర్టు…

మంత్రిని ఉద్దేశ పూర్వకంగా తప్పు దోవ పట్టించినట్లు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందన్న.- హైకోర్టు…

ముఖ్యమంత్రి ని ,మంత్రుల ను తప్పుదోవ పట్టించేలా మీ నివేధికలు ఉన్నాయి.- హైకోర్టు…

రవాణ శాఖ మంత్రిని, ప్రభుత్వాన్నీ తప్పుదోవ పట్టిస్తారా?- హైకోర్టు…

ప్రభుత్వాన్ని, సీఎంను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారన్న.. హైకోర్టు..

అధికారుల తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు..

మీ బాస్ నే తపుదోవ పట్టించారు… మాకు నిజాలు చెబుతున్నారాని ఎలా నమ్మాలి..హైకోర్టు…

ఆర్టీసీ ఎండీని స్వయంగా వివరణ ఇవ్వాలన్న హైకోర్టు…

నేరుగా వివరణ ఇస్తున్న ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.

తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇంచార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిసస్తున్నారో అర్థం కావడం లేదన్న – హైకోర్టు…

ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు… జీహెచ్ ఎంసీని ఎందుకు అడుగుతున్నారు?? జీహెచ్ ఎంసీ ఇవ్వాల్సి ఉందని మంత్రికి చెప్పారన్న.- హైకోర్టు…

జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు… ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్య……

ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు…

హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను ప్రశ్నించిన హైకోర్టు…

ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం వలనే సమ్మె కొనసాగుతోంది. దీనితో ప్రజలు 34 రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.- హైకోర్టు…

వేల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ లు కట్టే ప్రభుత్వం.. సమస్యలో ఉన్న ప్రజలకు 47 కోట్లు ఇవ్వలేరా?- హైకోర్టు…

ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చెయ్యాలి- హైకోర్టు…

ప్రజలకు ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోలేదా?- హైకోర్టు…

ఆర్టీసీ విభజన జరగకుండా ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్ ఇస్తుంది- హైకోర్టు…

ప్రభుత్వానికిి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా? హైకోర్టు…

ప్రభుత్వం సమస్య పరిష్కరించ కుంటే తామే ఓ నిర్ణయం తీసుకుంటాం.. మాకూ అధికారాలున్నాయ్ : హై కోర్టు

ఈ నెల 11 వ తారీఖు లోపు కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. హైకోర్టు…

ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయని విస్మరించొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు…

సమస్య పరిష్కరించక పోతే తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు….

తదుపరి విచారణను ఈ నెల 11 వ తేది సోమవారానికి వాయిదా….

ప్రభుత్వం తో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నాం కార్మిక సంఘాలు..

కోర్ట్ తీర్పు ను స్వాగతిస్తున్నాం..కార్మిక సంఘాలు.

About The Author