టాస్క్ ఫోర్స్ లో అమరవీరుల సంస్మరణ డేవిడ్ కరుణాకర్, శ్రీధర్ లకు ఘన నివాళి
తిరుపతి: చిత్తూరు జిల్లాటాస్క్ ఫోర్స్ కార్యాలయం లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ అల్లా బక్ష్ అధ్వర్యంలో ఎర్ర చందనం స్మగ్లర్లు చేతిలో హతమైన అటవీ అధికారులు శ్రీధర్, డేవిడ్ కరుణాకరన్ లకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అల్లా బక్ష్ మాట్లాడుతూ 1991లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చే హతుడైన డీఎఫ్ ఒ పందిళ్లపల్లి శ్రీనివాస్ కు నివాళి గా అమర వీరుల సంస్మరణ రోజును జరుపుకుంటున్నట్లు తెలిపారు. కరుడు గట్టిన వీరప్పన్ ను ముప్పుతిప్పలు పెట్టిన ఘనత శ్రీనివాస్ కే దక్కుతుందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఏర్పడక ముందు ఎర్ర చందనం స్మగ్లర్లు అటవీ అధికారులను హత్య చేశారని తెలిపారు. ఎసిఎఫ్ కృష్ణయ్య మాట్లాడుతూ శ్రీధర్, డేవిడ్ కరుణాకరన్ మరణించిన రోజున తాను కూడా విధి నిర్వహణ లో ఉన్నానని, వారి మరణం తనను కలిచివేసిందని అన్నారు. వారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిముషాలు మౌనం పాటించి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఐ లు మురళీ, చెందు, ఆర్ ఎస్ ఐ లు విజయ్, లింగాధర్, ఎస్ ఐ ప్రసాద్, ఎఫ్ ఆర్ ఒ పి.వి