విమానాన్ని ఆపిన ఎలుక..!?

శంషాబాద్: ఒక్క ఎలుక విమానాన్ని ఐదన్నర గంటలసేపు ఆపిన సంఘటన తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం సోమవారం ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలి. విమానంలోకి ఎలుక చొరబడింది. ప్రయాణికులందరూ ఐదున్నరకే విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎనిమిది గంటలవుతున్న అధికారుల నుంచి విమానం కోసం పిలుపురాలేదు. ఒక ప్రయాణికుడు వెళ్లి సలహా కేంద్రంలో విమానం ఎప్పుడు వెళ్తుందని ప్రశ్నించాడు. ఎప్పుడు వెళ్తోంది తమకు కూడా తెలియదని జవాభిచ్చారు. చివరకు 11.30 గంటలకు విమానం హైదరాబాద్ నుంచి వైజాగ్ కు బయలుదేరింది. ఇంత సమయం ఎందుకు తీసుకుందని ప్రయాణికులు విమానయాన అధికారిని అడిగితే ఎలుక విమానంలోకి దూరడంతో ఆలస్యమైందని సెలవిచ్చాడు.

ఒక్క ఎలుకతో విమానం ఆలస్యంగా బయలుదేరిందా? అని ప్రయాణికులు ముక్కున వేలేసుకున్నారు.

About The Author