స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు(గురువారం) హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనున్నది.ఇదిలా ఉంటే ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ తరపున అథరైజేషన్‌ను మంత్రుల నుంచి తొలగించారు. కలెక్టర్లు, సెక్రటేరియట్‌లో హెచ్‌వోడీలకు అధికారం ఇచ్చారు. 20 కోట్లకుపైగా ఆదాయం వచ్చే దేవాలయాలకు ట్రస్ట్‌బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రస్ట్ బోర్డుల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రులకు జగన్ సూచించారు