ఈ చలాన్ ద్వారా వాహనానికి 135 రూపాయల జరిమానా
వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాలజిల్లా:హెల్మెట్ ద్విచక్ర వాహనం సోమవారం నాడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ బాంక్ వద్ద హెల్మెట్ లేకుండా వెళ్తుండగా ఒక పౌరుడు ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన ఎస్.ఐ గారు ఆ వాహనాలను గుర్తించి జరిమానా వేయడం జరిగింది.
జిల్లా పోలీస్ సిబ్బంది వాహనం నుడుపునపుడు హెల్మెట్ మరియ సీట్ బెల్ట్ ధరించకుండా,మరియు ట్రాఫిక్ నియమాలు పాటించని వారికి జరిమాన విధించడం జరుగుతుందని అంతే కాకుండా శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలు పాటించని పోలీస్ సిబ్బందికి స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో రేపు కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు.హెల్మెట్ లేకుండా ప్రయాణించిన పోలీసు ద్విచక్ర వాహనము కు మంగళవారం నాడు ఈ చలాన్ ద్వారా వాహనానికి 135 రూపాయల జరిమానా విధించినట్లు మేడిపల్లి ఎస్.ఐ శ్రీనివాస్ తెలిపారు.