రాష్ట్రంలో భారీగా ప్రభుత్వ పాఠశాల మూసివేతకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇందు కోసం విద్యా హక్కు చట్టాన్ని సవరించడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల,మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్ల
పరిధిలో ఉన్నత పాఠశాల ఉండాలనే నిబంధన ఉన్నది. అయితే 5 కిలోమీటర్ల పరిధిలో ఈ మూడింటిలో ఒకటి ఉంటే సరిపోతుంది అనే
విధంగా సవరణ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ సవరణ ప్రభావం
ఎలా ఉంటుందో చర్చించడానికి ఓ కమిటీని విద్యా శాఖ కమిషనర్ నియమించారు. ఈ కమిటీ ఈ నెల 22 న సమావేశమై, చర్చించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంపై
ఉపాధ్యాయ సంఘాలు మండిపోతున్నాయి.

About The Author